KCR: రేపట్నుంచి యథావిధిగా కేసీఆర్‌ ఎన్నికల ప్రచారం

KCR Election Campaign As Usual From Tomorrow
x

KCR: రేపట్నుంచి యథావిధిగా కేసీఆర్‌ ఎన్నికల ప్రచారం

Highlights

KCR: 48 గంటల పాటు కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధం

KCR: బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ రోడ్‌ షో రేపటి నుంచి యథావిధిగా కొనసాగనుంది. కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం 48 గంటల పాటు నిషేధం విధించింది. మహబూబాబాద్‌ పట్టణంలో కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంలో ఉండగా.. ఈసీ అధికారులు కేసీఆర్‌ బస్సుయాత్ర వద్దకు చేరుకొని ఉత్తర్వులు ఇచ్చారు. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 48 గంటలు పాటు నిషేదం వర్తించేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిషేధం అమలులో ఉన్న సమయంలో బహిరంగ సభలు, ప్రదర్శనలు, ర్యాలీలు, రోడ్‌షోలు నిర్వహించొద్దని సీఈసీ సూచించింది.

రేపు రాత్రి 8 గంటలకు కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంపై నిషేధం గడువు ముగుస్తుంది. దీంతో.. రేపు రాత్రి 8 గంటల తర్వాత రామగుండంలో కేసీఆర్‌ రోడ్‌ షో నిర్వహిస్తారు. ఇక.. మే 4న సాయంత్రం మంచిర్యాలలో రోడ్‌ షో, మే 5న జగిత్యాలలో రోడ్‌ షో, మే 6న నిజామాబాద్‌లో రోడ్‌ షో నిర్వహిస్తారు గులాబీ బాస్. మే 7న కామారెడ్డితో పాటు మెదక్‌లో రోడ్‌ షోలో పాల్గొంటారు. మే 8న నర్సాపూర్‌, పటాన్‌చెరులో రోడ్‌ షో నిర్వహిస్తారు. మే 9న కేసీఆర్‌ బస్సు యాత్ర కరీంనగర్‌ చేరుకుంటుంది. అదే రోజు సాయంత్రం కరీంనగర్‌లో రోడ్‌ షో నిర్వహిస్తారు. మే 10న చివరి రోజు సిరిసిల్లలో రోడ్‌ షో అనంతరం సిద్దిపేటలో బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగిస్తారు. ఆ సభతో కేసీఆర్‌ ఎన్నికల ప్రచారం ముగుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories