KCR: రేపటి నుంచి కేసీఆర్ బస్సు యాత్ర

KCR Bus Yatra from Tomorrow
x

KCR: రేపటి నుంచి కేసీఆర్ బస్సు యాత్ర

Highlights

KCR: మిర్యాలగూడ నుంచి రోడ్ షో ప్రారంభం

KCR: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ఇందులో భాగంగా రాష్ర్ట వ్యాప్తంగా బస్సు యాత్ర, రోడ్ షోలు చేపట్టాలని డిసైడ్ అయ్యారు. బస్సు యాత్రకు షెడ్యూల్ ఖరారు చేశారు. రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ కేసీఆర్ ప్రచారం ఉండేలా బస్సు యాత్ర రూట్ మ్యాప్ రూపొందించారు. రేపు నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మిర్యాలగూడలో బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ప్రతి నియోజకవర్గంలోనూ స్థానిక నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. సాయంత్రం వేళల్లో కనీసం రెండు మూడు ప్రాంతాల్లో రోడ్ షోల్లో కేసీఆర్ పాల్గొంటారు. ప్రజలనుద్దేశించి కార్నర్ మీటింగ్‌లలో ప్రసంగించనున్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఇళ్లలోనే కేసీఆర్‌తో పాటు పార్టీ నేతలు బస చేస్తారు.

రేపటి నుంచి చేపట్టనున్న బస్సు యాత్ర మే 10 వరకు కొనసాగనుంది. రేపు మిర్యాలగూడ, సూర్యాపేటలో బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఎల్లుండి భువనగిరి, 26న మహబూబ్ నగర్, 27 నాగర్ కర్నూలు, 28న వరంగల్, 29న ఖమ్మం, 30న తల్లాడ, కొత్తగూడెంలో, మే ఒకటో తేదీన మహబూబాబాద్, మే 2న జమ్మికుంట, 3న రామగుండం, 4న మంచిర్యాల, 5న జగిత్యాల, 6న నిజామాబాద్‌, 7న కామారెడ్డి, మెదక్‌లో, 8వ తేదీన నర్సాపూర్, పటాన్ చెరులలో, 9వ తేదీన కరీంనగర్, 10వ తేదీన సిరిసిల్లలో రోడ్ షోలో నిర్వహించనున్నారు. చివరగా మే 10వ తేదీన సిద్దిపేటలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories