కేసీఆర్‌తో పొలం పనుల్లో హిమాన్షు.. పార పట్టుకుని.. వీడియో వైరల్..!

KCR And KTRs Son Himanshu Rao Plants Sapling
x

కేసీఆర్‌తో పొలం పనుల్లో హిమాన్షు.. పార పట్టుకుని.. వీడియో వైరల్..!

Highlights

KCR: మాజీ మంత్రి కేటీఆర్ కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు రావు పొలం పనుల్లో నిమగ్నమయ్యాడు.

KCR: మాజీ మంత్రి కేటీఆర్ కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు రావు పొలం పనుల్లో నిమగ్నమయ్యాడు. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో తాత కేసీఆర్ పర్యవేక్షణలో వ్యవసాయం నేర్చుకుంటున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను హిమాన్షు తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా.. ఆ వైరల్‌గా మారింది.

సంక్రాంతి సందర్భంగా విదేశీల నుంచి స్వరాష్ట్రం వచ్చాడు హిమాన్షు. ఈ క్రమంలోనే తన తాత వద్దకు వెళ్లాడు. పండుగ సందర్భంగా కేసీఆర్ తెల్లటి పట్టు వస్త్రాలు ధరించి.. తలపై టోపి పెట్టుకుని కనిపించారు. పంచెకట్టులో ఉన్న కేసీఆర్ మనువడు హిమాన్షుకు మొక్కను ఎలా నాటాలో నేర్పించారు. హిమాన్షు చేతిలో పార పట్టి గుంత తవ్వించారు. అనంతరం మామిడి మొక్కను మనవడితో నటించారు. ఎరువు వేసి మొక్క బాగా పెరిగేలా కేసీఆర్ సూచనలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను హిమాన్షు తన సోషల్ మీడియాలో పంచుకున్నాడు. వాతావరణ మార్పులకు అనుగుణంగా సహజ వనరులను కాపాడడం.. పరిరక్షించడం మన బాధ్యత. అత్యుత్తమైనది నేర్చుకున్నా అని హిమాన్షు పోస్టు చేశాడు.

హిమాన్షు పొలం పనుల్లో బిజీగా ఉంటే కేసీఆర్ పక్కనే నిల్చొని సూచనలు ఇచ్చారు. మొక్కల గురించి క్షుణ్నంగా వివరించారు. వ్యవసాయంలో అనుసరించాల్సిన చిట్కాల గురించి తెలియజేశారు. పొలం పనుల్లో తనకు ఉన్న అనుభవాన్ని, తెలిసిన మెళకువలను మనవడికి నేర్పించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను హిమాన్షు రావు తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తాత, మనవడి అనుబంధం చూసి కామెంట్స్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

ఉన్నత చదువుల కోసం హిమాన్షు 2023లో అమెరికా వెళ్లారు. పెన్సిల్వేనియా పిట్స్‌బర్గ్‌లోని కార్నిగీ మెల్లాన్‌ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. సంక్రాంతి సెలవులకు వచ్చిన హిమాన్షు.. తాజాగా ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో వ్యవసాయ క్షేత్రంలో ప్రత్యక్షం అయ్యాడు.

ఇదిలా ఉంటే.. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి కేసీఆర్ ఫామ్ హౌజ్‌కే పరిమితమయ్యారు. ముఖ్య నాయకులు ఎవరైనా కేసీఆర్‌ను కలవాలంటే ఫామ్ హౌజ్‌కే వెళ్లి కలుస్తున్నారు. కవిత జైలు నుంచి విడుదలైనప్పుడు కూడా కేసీఆర్ బయటకు రాలేదు. కవితనే వెళ్లి కేసీఆర్‌ను కలిశారు. ఇటీవల ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ విచారణ తర్వాత కేటీఆరే వెళ్లి కేసీఆర్‌ను కలిసి పరిస్థితులను వివరించారు. కానీ కేసీఆర్ మాత్రం బయటకు రావడంలేదు. అయితే కేసీఆర్ ఇక బయటికి రారా? వస్తే ఎప్పుడొస్తారు అనే చర్చలు కూడా జోరుగా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం కేసీఆర్ రాక కోసం ఎదురుచూస్తున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories