నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కవిత ఘన విజయం

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కవిత ఘన విజయం
x
Highlights

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఫలితం వెల్లడి అయింది.. మొత్తంగా..

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఫలితం వెల్లడి అయింది.. అందులో టిఆర్ఎస్ అభ్యర్థి కవితకు 532 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్ధికి 39 , కాంగ్రెస్ అభ్యర్ధికి 22 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే స్థానిక సంస్థలలో బీజేపీ కంటే కాంగ్రెస్ కు ఎక్కువ ఓట్లు ఉన్నా కూడా బీజేపీ కంటే తక్కువ ఓట్లు పడ్డాయి.

ఎన్నికల్లో మొత్తం 824 మంది గెలిచారు.. ఇందులో 49 మంది జెడ్పీటీసీలు, 535 మంది ఎంపీటీసీలు, 226 మంది కౌన్సిలర్లు, ఇతరులు 12 మంది ఉన్నారు. టిఆర్ఎస్ కు 494 ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్ కు‌ 140, బీజేపీ 84, స్వతంత్రులు 66, ఎంఐఎంకు 28 ఓట్లున్నాయి. అయితే స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం చాల మంది నేతలు కాంగ్రెస్ ను వీడి తెరాస లో చేరారు. ఇక ఎన్నికల్లో గెలుపొందిన కవిత ఈ నెల 14 న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.


Show Full Article
Print Article
Next Story
More Stories