కవిత జైలుకు వెళ్ళడానికి ముందు చేసిన లాస్ట్ ట్వీట్... విడుదలయ్యాక చేసిన ఫస్ట్ ట్వీట్ ఏంటో తెలుసా..?

కవిత జైలుకు వెళ్ళడానికి ముందు చేసిన లాస్ట్ ట్వీట్... విడుదలయ్యాక చేసిన ఫస్ట్ ట్వీట్ ఏంటో తెలుసా..?
x

కవిత జైలుకు వెళ్ళడానికి ముందు చేసిన లాస్ట్ ట్వీట్... విడుదలయ్యాక చేసిన ఫస్ట్ ట్వీట్ ఏంటో తెలుసా..?

Highlights

Kavitha First & Last Tweet: కల్వకుంట్ల కవిత మళ్లీ ఎక్స్‌లో యాక్టివ్ అయ్యారు. అదేనండి.. ట్విటర్‌లో పోస్టులు పెట్టడం షురూ చేశారు. నిన్న సాయంత్రం ఢిల్లీ...

Kavitha First & Last Tweet: కల్వకుంట్ల కవిత మళ్లీ ఎక్స్‌లో యాక్టివ్ అయ్యారు. అదేనండి.. ట్విటర్‌లో పోస్టులు పెట్టడం షురూ చేశారు. నిన్న సాయంత్రం ఢిల్లీ నుండి హైదరాబాద్ చేరుకున్న కవిత.. ముందుగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వెళ్లారు. నిన్నంతా అక్కడే బస చేసి ఇవాళ మధ్యాహ్నం ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లో ఉన్న తన తండ్రి కేసీఆర్‌ని వెళ్లి కలిశారు. ఐదున్నర నెలల తరువాత తన తండ్రిని కలిసిన కవిత.. గట్టిగా హత్తుకుని ఇన్ని రోజులుగా తన గుండెల్లో ఉన్న భారాన్ని దించుకున్నారు. ఈ సందర్భంగా తన తండ్రిని హత్తుకున్న ఫోటోను కవిత ఎక్స్‌లో షేర్ చేశారు. కవిత జైలు నుండి బయటికొచ్చిన తరువాత ఎక్స్‌లో చేసిన రెండో పోస్ట్ ఇది.

అంతకంటే ముందుగా హైదరాబాద్‌లోని తన నివాసం వద్ద సోదరుడు కేటీఆర్‌తో కలిసి అభివాదం చేస్తోన్న ఫోటోను కవిత ఎక్స్‌లో పోస్ట్ చేశారు. జైలు నుండి వచ్చిన తరువాత కవిత ఎక్స్ వేదికగా షేర్ చేసిన మొదటి ఫోటో ఇదే. ఎక్స్‌లో మొదటి పోస్ట్ పెట్టిన కవిత.. ఆ పోస్టులోని ఫోటోపై సత్యమేవ జయతే అనే నినాదాన్ని రాసుకొచ్చారు.

తాజాగా ఎక్స్‌లో యాక్టివ్ అయిన కవిత పోస్ట్ చేసిన ఈ రెండు ట్వీట్స్ మాత్రమే కాదు... ఆమె జైలుకు వెళ్లడానికి రెండు రోజుల ముందు ఐదున్నర నెలల క్రితం పెట్టిన చివరి రెండు పోస్టులు కూడా జనం దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. మార్చి 16న కవిత అరెస్ట్ అవగా.. అంతకంటే రెండు రోజుల ముందు మార్చి 14న రెండు ట్వీట్ చేశారు. అందులో ఒకటి యాదగిరిగుట్ట లక్ష్మీ నర్సింహ స్వామి ఆలయం ఫోటో ఉంది. బ్రహ్మోత్సవాల కోసం బంగారువర్ణంలో మిరుమిట్లుగొలిపే కాంతులతో అందంగా అలంకరించిన ఆలయం ప్రతిబింబం అక్కడ ఆలయం చుట్టూ నిలిచిన వర్షపు నీటిలో స్పష్టంగా, మరింత అందంగా కనిపిస్తోంది. ఈ ఫోటోను షేర్ చేసిన కవిత.. దేవుడు శాసించాడు... కేసీఆర్ నిర్మించాడు అంటూ ఒక ట్యాగ్ లైన్ రాశారు.

అదే రోజున, అంతకంటే ముందుగా మరొక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఇద్దరు చిన్నారులు హ్యాపీ బర్త్ డే కవితక్క అంటూ ఆమెకు బర్త్ డే విషెస్ చెబుతున్నట్లుగా ఉంది. మార్చి 13న కవిత బర్త్ డే కావడంతో తనకు అందిన బర్త్ డే విషెస్ వీడియోల్లో ఒకదానిని "క్యూటెస్ట్" అంటూ ఆమె ఇక్కడ నెటిజెన్స్‌తో పంచుకున్నారు. తన కుటుంబంలో ఇలా తనకు ఎంతోమంది శ్రేయోభిలాషులు ఉన్నారని కవిత ఈ ట్వీట్‌లో పేర్కొన్నారు.

కవిత జైలు నుండి వచ్చి మళ్లీ ఎక్స్‌లో యాక్టివ్ అయిన నేపథ్యంలో ఈ ట్వీట్స్‌పై నెటిజెన్స్ మరొకసారి ఫోకస్ చేస్తున్నారు. కవిత ఏం మాట్లాడుతారా ? ఏం చెబుతారా అని ఆమె ఎక్స్ ఖాతాపై చూసేవారికి దర్శనం ఇస్తోన్న మొదటి నాలుగు ట్వీట్స్ ఇవి. అన్నట్లుగా కవిత ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లోనే 10 రోజుల పాటు ఉండనున్నారని తెలుస్తోంది. గత ఐదున్నర నెలలుగా తన కుటుంబంతో సమయం గడపలేకపోయినందున.. ఈ 10 రోజులు కుటుంబంతోనే సరదాగా సమయం గడపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాతే పార్టీ వర్గాలకు అందుబాటులోకి వస్తానని కవిత చెప్పినట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories