Kamma Reddy: నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అదుపులో కామారెడ్డి ఎక్సైజ్ కానిస్టేబుల్

Kamareddy Excise Constable Under The Narcotics Department
x

Kamma Reddy: నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అదుపులో కామారెడ్డి ఎక్సైజ్ కానిస్టేబుల్

Highlights

Kamma Reddy: షాద్‌నగర్‌ పీఎస్‌కు పిలిచి విచారణ జరుపుతున్నట్లు సమాచారం

Kamma Reddy: కామారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ సిబ్బంది కల్తీకల్లు తయారీ ముస్తదారులతో కలిసి నిర్వహిస్తున్న నిషేధిత ఆల్ఫాజోలం దందాను హైదరాబాద్‌కు నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అధికారులు భగ్నం చేశారు. రెండు రోజుల క్రితం కామారెడ్డి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక కానిస్టేబుల్‌ను, ఇద్దరు కల్లు ముస్తేదారులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నిషేధిత 30 కిలోల ఆల్ఫాజోలంను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.

కామారెడ్డి జిల్లాలో జరిగే కల్తీకల్లు కొందరు సిండికేట్‌గా ఏర్పడి మత్తు పదార్థాలను కలిపి విక్రయిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోని కామారెడ్డి ఎక్సైజ్ ఎస్‌హెచ్‌ఓ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించే వ్యక్తితో పాటు మరో ఇద్దరిని హైదరాబాద్‌కు చెందిన నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మూడు కోట్ల విలువైన నిషేధిత ఆల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో మరికొందరు ఎక్సైజ్ సిబ్బంది ప్రమేయం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు ఎక్సైజ్ అధికారులకు కానిస్టేబుల్ అరెస్టు విషయం గురించి సమాచారం అందించినట్టు తెలిసింది.

ఎక్సైజ్ అధికారులుగా కొందరు సిబ్బంది ఆల్ఫాజోలం దందాను చేస్తున్నట్టు సమాచారం. తమ ఉద్యోగాన్ని ఆసరాగా చేసుకొని హైదరాబాద్, మహారాష్ట్ర నుంచి నిషేధిత మత్తు పదార్థాలను తీసుకువచ్చి కల్తీకల్లు తయారు చేసే ముస్తేదారులకు ఇస్తున్నట్టు తెలిసింది. ఈ కేసులో మరి కొంతమంది సిబ్బంది ప్రమేయం ఉండడంతో కామారెడ్డి జిల్లా అధికారి శాఖలో ఈ వ్యవహారం కలకలం రేపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories