కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి కన్నుమూత.. సీఎం కేసీఆర్ సంతాపం..

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి కన్నుమూత.. సీఎం కేసీఆర్ సంతాపం..
x
Highlights

Kalwakurthy former mla edema kishta reddy passes away: కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి ఈ రోజు ఉదయం కన్నుమూశారు. గత కొంత...

Kalwakurthy former mla edema kishta reddy passes away: కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి ఈ రోజు ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన గొంతు నొప్పితో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని ఒమేగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. కల్వకుర్తి ఎమ్మెల్యేగా రెండు సార్లు పని చేశారు. ఇక స్వతంత్ర అభ్యర్థిగా ఒకసారి, కాంగ్రెస్ పార్టీ తరపున మరోసారి ఎడ్మ కిష్టారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కిష్టా రెడ్డి మృతిపై పలువురు ప్రజాప్రతినిధులు సంతాపం ప్రకటించారు.

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రగాఢ సంతాపం తెలిపారు. సామాజిక సేవా దృక్పథం, సామాజిక సృహ కలిగిన నాయకుడిగా కిష్టారెడ్డి ప్రజల అభిమానం సంపాదించారని సీఎం అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.



Show Full Article
Print Article
Next Story
More Stories