Kalvakuntla Kavitha In Rakhi Carnival 2020 : రాఖీ సంబరాల్లో కల్వకుంట్ల కవిత

Kalvakuntla Kavitha In Rakhi Carnival 2020 : రాఖీ సంబరాల్లో కల్వకుంట్ల కవిత
x
ప్రగతి భవన్ లో రాఖీ సంబరాలు
Highlights

Kalvakuntla Kavitha In Rakhi Carnival 2020 : మన సంస్కృతిలో ఇంటి ఆడపడుచుకు ఇచ్చే ప్రాధాన్యం లెక్కే వేరు.

Kalvakuntla Kavitha In Rakhi Carnival 2020 : మన సంస్కృతిలో ఇంటి ఆడపడుచుకు ఇచ్చే ప్రాధాన్యం లెక్కే వేరు. ఎక్కడ ఉన్నా..ఎలా ఉన్నా సోదరుడు సంతోషంగా ఉండాలని ఆశపడే సోదరి,.. నీ కష్టంలో రక్షనై ఉంటానని చెప్పే పండుగే రాఖీ పండుగ. తన తోబుట్టువు ఎక్కడున్నా ఆనందాల పందిరిలో చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తూ జరుపుకునే వేడుకే రాఖీ పండుగ. శ్రావణ మాసంలో పౌర్ణిమ రోజు సోదరి సోదరుల సంబంధానికి సోదరుని చేతికి కట్టే రక్ష.. జగతిలో ఆ బంధానికి ఇచ్చే భరోసా. ఒకరికి ఒకరం ఉన్నామంటూ అన్నచెల్లెల్లు చెప్పుకునే బాస. అందుకే ఈ పండగను తోబుట్టువులు వైభవంగా జరుపుకుంటారు. ఇప్పటికే ఈ రాఖీ వేడుకలు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం దేశంలో కరోనా ఎఫెక్ట్ ఉన్నప్పటికీ తమ సోదరులకు రాఖీ కట్టి సోదరీమనులు ఆశీర్వచనాలు తీసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంట్లో కూడా రాఖీ వేడుకలు మొదలయ్యాయి. సీఎం కేసీఆర్ కుమార్తె కవిత సోదరుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అదే విధంగా ప్రగతిభవన్‌లో నిర్వహించిన రక్షాబంధన్‌ వేడుకల్లో రాజ్యసభ సభ్యుడు జీ సంతోష్‌కుమార్‌కు ఆయన సోదరి, నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత రాఖీ కట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో సోదర, సోదరీమణులందరు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి కోరారు. అన్నా చెల్లెల్లు-అక్కా తముళ్లు ఎంతో ప్రేమానురాగాలతో జరుపుకునే పండుగ రాఖీ పౌర్ణమి అని తెలిపారు. ఇక ప్రగతి భవన్ లో మంత్రి సత్యవతి రాథోడ్, లోక్‌సభ సభ్యురాలు మాలోతు కవిత, ఎమ్మెల్యే సునీత, జడ్పీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, టీఆర్‌ఎస్ మహిళా నాయకురాలు గుండు సుధారాణి సైతం సంతోష్‌కుమార్‌కు రాఖీ కట్టారు.



Show Full Article
Print Article
Next Story
More Stories