Sriram Sagar Project: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కాళేశ్వరం జలాలు..

Kaleshwaram Water For Sriram Sagar Project
x

Sriram Sagar Project: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కాళేశ్వరం జలాలు..

Highlights

Sriram Sagar Project: రూ.2 వేల కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు

Sriram Sagar Project: ఉత్తర తెలంగాణ వర ప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కాళేశ్వరం జలాలు పరుగులు పెడుతున్నాయి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న శ్రీరాంసాగర్ పునర్జీవ కార్యక్రమం విజయవంతమైంది. .నిజామాబాద్ జిల్లా పోచంపల్లి లో నిర్మించిన శ్రీరాంసాగర్ నుంచి నీటిని దిగువకు విడుదల చేయడం ఉత్తర తెలంగాణవాసులకు ఇదొక అబ్బురపడే దృశ్యంగానే చెప్పాలి. దిగువన ఉండే మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్ నుంచి ఎగువన ఉన్న SRSP కి నీటిని తరలిస్తున్న దృశ్యం నిజంగా ఏనాడూ ఊహకి కూడా అంతుచిక్కనదే అంటే అతిశయోక్తి కాదు ..అలాంటి సందర్భమే ఇప్పుడు ఉత్తర తెలం.గాణ లోని SRSP వరద కాలువల సాక్షిగా కనపడుతున్నాయి.

మహారాష్ట్ర లో అనేక ప్రాజెక్టు‌లు ,బ్యారేజ్ లు కట్టడంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిండిన సందర్భాలు చాలా తక్కువే ..ఇలాంటి కారణాలతో SRSP చాలా ఏళ్లుగా నీళ్లు లేక వెలవెలబోయింది. ఈ ప్రాజెక్టుకు కాళేశ్వరం జలాలతో జీవం పోయాలనే లక్ష్యంతోనే ఎస్సారెస్పీ పునర్జీవ పథకానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం ..సుమారు రెండు వేల కోట్లతో చేపట్టిన ఈ పునర్జీవ పథకానికి 2017 ఆగస్టు 10న నిజామాబాద్ జిల్లా ముప్కాల్‌ గ్రామం‌లో శంకుస్థాపన చేశారు.

మొదట జగిత్యాల జిల్లా రాంపూర్‌ గ్రామ శివారు లోని SRSP వరద కాలువ 73వ కిలోమీటర్‌ పాయింట్ దగ్గర మొదటి పంపుహౌస్‌ నిర్మించారు. అలాగే మెట్‌పల్లి మండలం రాజేశ్వర్‌రావుపేట గ్రామంలోని వరద కాలువ 34 కిలోమీటర్‌ పాయింట్ దగ్గర రెండో పంపుహౌస్‌ నిర్మించారు ..నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ గ్రామం లోని 0.10 కిలోమీటర్‌ పాయింట్ దగ్గర మూడో పంపుహౌస్‌ను నిర్మించారు ...ఇలా నిర్మించిన ప్రతి పంపుహౌస్‌లో ఎనిమిది మోటర్లు ఏర్పాటు చేశారు. పునర్జీవంలో భాగంగా.. ముందుగా రాంపూర్‌ పంపుహౌస్‌ నుంచి రాజేశ్వర్‌రావుపేటకు, ఆ తర్వాత అక్కడి నుంచి ముప్కాల్‌కు, ముప్కాల్‌ పంపు నుంచి ఎస్పారెస్పీ లోకి నీటిని ఎత్తిపోస్తున్నారు.

ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టును కాళేశ్వర జలాలతో నింపి, ఆయకట్టు రైతులకు భరోసానివ్వాలన్న లక్ష్యంతో కాళేశ్వరం ఎత్తిపోతలను ప్రారంభించింది ప్రభుత్వం. వారం రోజుల నుంచి విజయవంతంగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories