Konda Surekha: పిచ్చి వాగుడు వాగి సారీ చెబితే సరిపోతుందా? ఇదే అమెరికాలో అయితే... – కేఏ పాల్ రియాక్షన్

KA Paul Comments On Konda Surekha
x

పిచ్చి వాగుడు వాగి సారీ చెబితే సరిపోతుందా? ఇదే అమెరికాలో అయితే... – కొండా సురేఖపై కేఏ పాల్ ఫైర్

Highlights

కొండా సురేఖ బుధవారం నాడు నాగచైతన్య, సమంతల గురించి చేసిన వ్యాఖ్యలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఘాటుగా రియాక్టయ్యారు. కాంగ్రెస్ పార్టీకి...

కొండా సురేఖ బుధవారం నాడు నాగచైతన్య, సమంతల గురించి చేసిన వ్యాఖ్యలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఘాటుగా రియాక్టయ్యారు. కాంగ్రెస్ పార్టీకి మహిళల పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా ఆమెను వెంటనే పార్టీ నుంచి, మంత్రి పదవి నుంచి తొలగించాలని పాల్ మీడియాతో అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.

‘పిచ్చి వాగుడు అంతా వాగి సారీ చెబితే సరిపోతుందా? ఇదే అమెరికాలో అయితే బిలియన్ డాలర్ల వివాదంగా మారుతుంది’ అని ఆయన అన్నారు. కొండా సురేఖ 72 గంటల్లోగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం రాత్రే ఈ మేరకు ట్వీట్ చేసిన కేఏ పాల్ ఆ తరువాత మీడియాతో కూడా మాట్లాడారు.

‘ఆమె వెంటనే నాగార్జున ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి. నాగార్జున భార్యకు క్షమాపణ చెప్పాలి. సమంతకు క్షమాపణలు చెప్పాలి. అలాగే నాగార్జున కుమారుడు నాగ చైతన్యకు క్షమాపణ చెప్పాలి’ అని అన్నారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ పరువే పోతుందని ఆయన వ్యాఖ్యానించారు.

ఆమె వ్యాఖ్యలు సమంతాను తీవ్రంగా కలచివేసే విధంగా ఉన్నాయని పాల్ అన్నారు. ఆమెపై చర్య తీసుకోవడం ద్వారా దేశంలో 50 శాతం ఉన్న మహిళల పట్ల తమకు గౌరవం ఉందని కాంగ్రెస్ పార్టీ నిరూపించుకోవాలి అని పాల్ అన్నారు.

సురేఖ వ్యాఖ్యలపై సినీ రంగంలోని ప్రముఖులందరూ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. సెలెబ్రిటీల వ్యక్తిగత జీవితాలను రాజకీయాలకు వాడుకోవడం సరైన పని కాదని తీవ్రంగా విమర్శించారు.

నాగార్జున తాను ప్రస్తుతం విశాఖలో ఉన్నానని హైదరాబాద్ రాగానే మంత్రి సురేఖకు లీగల్ నోటీసులు పంపిస్తానని అన్నారు.

అయితే, గురువారం ఉదయం కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. సమంతను నొప్పించడం తన ఉద్దేశం కాదని క్షమాపణలు చెప్పారు.


Show Full Article
Print Article
Next Story
More Stories