Ka Paul: విశాఖపట్నం సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించిన కేఏ పాల్

Ka Paul Approached Visakhapatnam Cyber Crime Police
x

Ka Paul: విశాఖపట్నం సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించిన కేఏ పాల్

Highlights

Ka Paul: నా ప్రతిష్టకు భంగం కలిగింది..చర్యలు తీసుకోండి

Ka Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పోలీసులను ఆశ్రయించారు. తన ఫోటోలను మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఫేక్ ఫోటోలతో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈమేరకు ఆయన విశాఖపట్నం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇటీవల రాజమహేంద్రవరం మంజీర హోటల్‌లో తెలుగుదేశం, జనసేన పార్టీల తొలి సమన్వయ కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌లు తొలుత షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. అనంతరం ఉమ్మడి కార్యచరణపై చర్చించారు. అయితే నారా లోకేశ్ -పవన్ కళ్యాణ్ భేటీ పై ఫోటోలు మార్ఫింగ్ చేశారు. ఇద్దరి మధ్య చర్చలు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఆధ్వర్యంలో జరిగినట్లు ఫోటో సృష్టించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే తనను కించపరిచే విధంగా ఫోటోలు షేర్ చేశారని అన్నారు. ఈ ఫోటోల మార్ఫింగ్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీసులకు కేఏ పాల్ ఫిర్యాదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories