MLC Kavitha: ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో కవిత బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు వాయిదా

Judgment On Kavitha Bail Petition Postponed In Liquor Policy CBI Case
x

MLC Kavitha: లిక్కర్‌ పాలసీ కేసులో కవిత బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు వాయిదా

Highlights

MLC Kavitha: మే 6కు వాయిదా వేసిన రౌస్ అవెన్యూ కోర్టు

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై కోర్టు తీర్పును వాయిదా వేసింది. కవిత బెయిల్ పిటిషన్లపై ఇప్పటికే వాదనలు పూర్తికాగా.. ఇవాళ తీర్పు వెలువరిచింది. తీర్పును మరోసారి వాయిదా వేసింది. ఈ పిటిషన్లపై ఈ నెల 6న తీర్పు వెలువరిస్తామని జడ్జి వెల్లడించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత తీహార్ జైల్లో ఉన్నారు. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కవిత.. తనను సీబీఐ అరెస్టు చేయడంపైన న్యాయపోరాటం చేస్తున్నారు.

లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు మార్చి 15న అరెస్టు చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చి కవిత నివాసంలోనే ఆమెను ప్రశ్నించాక.. సాయంత్రం అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు. కోర్టు కస్టడీ విధించడంతో కవితను తీహార్ జైలుకు తరలించారు. జైలులో ఉన్న కవితను ఇదే కేసులో ఈ నెల 11న సీబీఐ కూడా అరెస్టు చేసింది. కోర్టు అనుమతితో అధికారులు ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ అరెస్టులపై కోర్టులో కవిత పోరాడుతున్నారు. ఈడీ, సీబీఐ కేసులలో బెయిల్ కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

తొలుత మధ్యంతర బెయిల్ కోసం కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. దీంతో పూర్తిస్థాయి బెయిల్ కోసం కవిత మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ఈడీ, సీబీఐ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ... కవితకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను బెదిరించే అవకాశం ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసులో ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తూ బెయిల్ పిటిషన్ తిరస్కరించాలని కోర్టును అభ్యర్థించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories