ఇవాళ మరోసారి జేపీ నడ్డా, అమిత్‌ షా ప్రచారం

JP Nadda and Amit Shah are Campaigning Again Today
x

ఇవాళ మరోసారి జేపీ నడ్డా, అమిత్‌ షా ప్రచారం

Highlights

Telangana: బాన్సువాడ, జుక్కల్‌లో జేపీ నడ్డా ఎన్నికల ప్రచారం

Telangana: తెలంగాణలో బీజేపీ స్పీడ్ పెంచింది. ప్రచారంలో భాగంగా అగ్రనేతలు తెలంగాణ ప్రచారంలో దింపింది. ఇవాళ తెలంగాణలో మరోసారి అమిత్ షా, నడ్డా పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను బీజేపీ ప్రకటించింది. బాన్సువాడ, జుక్కల్ ఎన్నికల ప్రచారంలో జేపీ నడ్డా పాల్గొననున్నారు.

ఇక ఉదయం 10: 30 గంటలకు అమిత్‌షా బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. 11:15 నిమిషాలకు హుజూరాబాద్ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అక్కడి బీజేపీ అభ్యర్థి తరపున ఆయన ప్రచారం నిర్వహిస్తారు. 12:40 కి పెద్దపల్లి బహిరంగ సభకు హాజరుకానున్న అమిత్‌ షా.. మధ్యాహ్నం 2గంటలకు మంచిర్యాల బహిరంగ సభలో పాల్గొంటారు. 4:10 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయం నుంచి అమిత్‌ షా ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories