JEE Main Result 2020 : జేఈఈ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్ధులు

JEE Main Result 2020 : జేఈఈ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్ధులు
x
Highlights

JEE Main Result 2020 : జేఈఈ మెయిన్స్‌-2020 పరీక్షలో తెలుగు విద్యార్థులు మరోసారి తమ సత్తాచాటారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించిన 2.5 లక్షల మందిలో...

JEE Main Result 2020 : జేఈఈ మెయిన్స్‌-2020 పరీక్షలో తెలుగు విద్యార్థులు మరోసారి తమ సత్తాచాటారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించిన 2.5 లక్షల మందిలో ఏపీ, తెలంగాణ విద్యార్థులు దాదాపు 12 వేల మంది దాకా ఉండొచ్చని అంచనా. అయితే వారిలో 24 మంది తెలుగు అభ్యర్థులు 100 పర్సెంటేజ్ ను సాధించారు. జాతీయస్థాయిలో ఓపెన్‌ కేటగిరీలో టాపర్లుగా నిలిచారు. ఆ విద్యార్ధుల్లో తెలంగాణ విద్యార్థులు ఎనిమిది మంది ఉండగా ఏపీ విద్యార్థులు ముగ్గురు ఉన్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని 8మంది విద్యార్ధులు 100 పర్సెంటైల్ సాధించడంతో రాష్ట్రం టాప్- 1లో నిలిచింది. అదే విధంగా ఢిల్లీలో 5 గురు విద్యార్ధులు 100 పర్సెంటైల్ తెచ్చుకోవడంతో రెండో స్థానంలో నిలిచింది. నలుగురు అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించడంతో రాజస్థాన్ మూడో స్థానంలో నిలిచింది. ముగ్గురు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడంతో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది. అదే విధంగా హర్యానా నుంచి ఇద్దరు, గుజరాత్ నుంచి ఒకరు, మహారాష్ట్ర నుంచి ఒకరు 100 పర్సెంటైల్ సాధించిన వారి జాబితాలో ఉన్నారు.

100 పర్సెంటైల్ సాధించిన తెలంగాణ విద్యార్ధుల్లో వాడపల్లి అరవింద్‌ నరసింహ, రాచపల్లి శశాంక్‌ అనిరుద్‌, రొంగల అరుణ్‌ సిద్ధార్థ, ఛాగరి కౌశల్‌ కుమార్‌రెడ్డి, చుక్కా తనూజ, సాగి శివకృష్ణ, దీతి యశ్‌సచంద్ర, మొర్రెడ్డిగారి లిఖిత్‌ రెడ్డి, ఉన్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ చెందిన విద్యార్ధుల్లో ఏపీకి చెందిన లండ జితేంద్ర, తడవర్తి విష్ణు శ్రీసాయి శంకర్‌, వైఎస్‌ఎస్‌ నరసింహనాయుడు ఉన్నారు.

ఇక పోతే కరోనా వల్ల రెండుసార్లు వాయిదా పడిన పరీక్షలను మూడోసారి కూడా వ్యతిరేకతల మధ్య ఎన్‌టీఏ నిర్వహించింది. ఈ ఏడాది కేంద్ర విద్యా శాఖ సమాచారం ప్రకారం 8.58 లక్షల మంది విద్యార్థుల్లో ఇంజినీరింగ్ ఎంట్రన్స్ టెస్టుకు 6.35లక్షల మంది హాజరయ్యారు. ఈ పరీక్షలు సెప్టెంబర్ 1 నుంచి 6 మధ్య జరిగాయి. ఇక దేశవ్యాప్తంగా వెల్లడయిన ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ పొందవచ్చు.

ఇక జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్ 2020 ఫలితాల్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ర్యాంకులను అధికారిక వెబ్‌సైట్ https://nta.nic.in/లో తెలుసుకోవచ్చు. అదే విధంగా http://ntaresults.nic.in/ , https://jeemain.nta.nic.in/ లో కూడా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories