తెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం

Jai Shri Ram VS Jai Hanuman in Telangana
x

తెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం

Highlights

Telangana Politics: రాజకీయాల్లో ఎత్తులకు పైఎత్తులే ఉంటాయి. ప్రత్యర్థిని చిత్తు చేయడమే లక్ష్యంగా పావులు కదులుతుంటాయి.

Telangana Politics: రాజకీయాల్లో ఎత్తులకు పైఎత్తులే ఉంటాయి. ప్రత్యర్థిని చిత్తు చేయడమే లక్ష్యంగా పావులు కదులుతుంటాయి. ఎత్తుకు కౌంటర్‎గా సరైన ఎత్తు వేసినప్పుడే ప్రత్యర్థులు చిత్తవుతారు. అది రివర్సయితే రిజల్ట్ కూడా రివర్స్‎గానే ఉంటుంది. తెలంగాణలో ప్రధాన రాజకీయమంతా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టుగా నడుస్తున్న క్రమంలో కారక్యకర్తలకు ఉత్తేజాన్నిచ్చే నినాదాలు కూడా మారిపోతున్నాయి.

బీజేపీ నేతలు రామమందిర ఉద్యమం నుంచి జైశ్రీరామ్ అనే నినాదంతో దూసుకెళ్తున్నారు అదే సెంటిమెంట్‎తో ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్నారు. దానికి కౌంటర్‎గా తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జైహనుమాన్ నినాదాన్ని పాపులరైజ్ చేయాలని నిర్ణయించారు. రానున్న కొద్దిరోజుల్లో జైశ్రీరామ్ వర్సెస్ జైహనుమాన్ అనే నినాదాలు హోరెత్తడం ఖాయంగా చెబుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories