Jagga Reddy: సీఎం అభ్యర్థి విషయంలో మాకు స్పష్టత ఉంది

Jagga Reddy Says Dont Tension About Congress CM Candidate
x

Jagga Reddy: సీఎం అభ్యర్థి విషయంలో మాకు స్పష్టత ఉంది

Highlights

Jagga Reddy: బీఆర్ఎస్ చెప్పుకోవడానికి ఏ అంశంపై లేక.. తెలంగాణ వాదాన్నే ముందుకు తీసుకొస్తోంది

Jagga Reddy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లు ఖాయమని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 15 తర్వాత కాంగ్రెస్ స్పీడ్ ఎవరూ ఆపలేరన్నారు. బీఆర్ఎస్ చెప్పుకోవడానికి ఏ అంశంపై లేక మళ్లీ తెలంగాణ వాదాన్నే ముందుకు తీసుకొస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి విషయంలో ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. సోనియా, రాహుల్ మల్లికార్జున ఖర్గే ఆలోచించి, అందరి అభిప్రాయాలు తీసుకొని ముఖ్యమంత్రిని డిసైడ్ చేస్తారని వెల్లడించారు.

ప్రభుత్వం మళ్ళీ రాదని బీఆర్ఎస్‌కు భయం, అనుమానం పట్టుకుందన్నారు. ఇది మాటల ప్రభుత్వమని గ్రామాల్లో చర్చ నడుస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని బీఆర్ఎస్‌కు అర్ధమైందని.. కర్నాటక ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలను మిస్ గైడ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories