IT Raids: ఎన్నికల వేళ తెలంగాణలో ఐటీ పంజా

IT Raids In Telangana In Time Of Elections
x

IT Raids: ఎన్నికల వేళ తెలంగాణలో ఐటీ పంజా

Highlights

IT Raids: ఐటీ సోదాలతో తమకేం సంబంధం అంటున్న కమలనాథులు

IT Raids: తెలంగాణలో ఓ వైపు ఎన్నికల కాకరేపుతుంటే.. మరోవైపు ఐటీ సోదాలు హడలెత్తిస్తున్నాయి. పొలిటికల్ లీడర్లు, వారి బిజినెస్‌లే టార్గెట్‌గా రైడ్స్ జరుగుతుండటంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్నికల వేళ ప్రత్యర్థులను ఇరుకున పెట్టేందుకే బీజేపీ ఈ పని చేయిస్తోందని,, ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తుండటం పొలిటికల్‌ హీట్ పుట్టిస్తోంది. ఐతే ప్రతిపక్షాల ఆరోపణలను బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. ఐటీ దాడులకు.. పార్టీకేం సంబంధం అంటూ తిప్పికొడుతున్నారు.

ఇటీవలే మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువు ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్లో మూడు రోజుల పాటు ఈ ఐటీ సోదాలు కొనసాగాయి. ఫార్మా కంపెనీ యజమాని ప్రదీప్ రెడ్డి, రియల్టర్ కోట్ల నరేందర్ రెడ్డి ఇళ్లలో 7 కోట్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ప్రదీప్ రెడ్డి.. మంత్రి సబితా ఇంద్రారెడ్డికి బంధువు. గచ్చిబౌలిలోని ప్రదీప్ రెడ్డి ఇంటితోపాటు, కంపెనీ డైరెక్టర్లు, సిబ్బంది ఇండ్లలో సోదాలు చేశారు. అంతకు ముందు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లోనూ ఐటీ దాడులు జరిగాయి. తాజాగా మిర్యాలగూడ, త్రిపురారం, నిడమనూరు, నల్గొండ, అనుముల మండలాల్లోని పలు రైస్ మిల్లుల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ రైడ్స్.. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావుపైనే అంటూ అంటూ ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తలను ఎమ్మెల్యే భాస్కర్‌రావు ఖండించారు.

ఎన్నికల ముందు.. ఈడీ, ఐటీలు రావడం సహజమే అని ఎప్పటి నుంచో బీజేపీని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాజాగా ఎన్నికల వేళ రైడ్స్ జరగడం.. అది కూడా ప్రతిపక్ష నేతలు, వారి అనుచరుల ఇండ్లే టార్గెట్ కావడం.. హాట్ టాపిక్ గా మారింది. ఇతర పార్టీల అభ్యర్థులను ఇబ్బంది పెట్టడానికే బీజేపీ.. ఈ విధంగా ఐటీని ఉసికొల్పుతోందని.. ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతల ఇండ్లపై ఎందుకు ఐటీ రైడ్స్ జరగవంటూ..ప్రశ్నిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories