TS BJP: సంస్థాగత కార్యక్రమాలు నిర్వహిస్తోన్న బీజేపీ
TS BJP: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని రాజకీయ పార్టీలన్నీ ఇప్పటికే సన్నద్ధమయ్యాయి. ఈ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు కీలకం కావడంతో ఎవరికి వారు వ్యూహాత్మక ఎత్తుగడలతో ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు. మూడో సారి అధికారాన్ని చేజిక్కించుకుని పరిపాలన సాగించాలని బీఆర్ఎస్, బీఆర్ఎస్ను గద్దె దించి... అధికారం హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్, తెలంగాణలో కమలం వికసించేలా చేసి, కాషాయ జెండాను రెపరెపలాడించేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.
ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేస్తున్నాయి. వచ్చే ఎన్నికలకు దూకుడుగా వెళ్లాలని భావిస్తున్న బీజేపీ... తెలంగాణలో కదనరంగంలోకి దిగేసింది. దీంట్లో భాగంగానే 14 ఎన్నికల కమిటీలను ప్రకటించింది. బీజెపీ నియమించిన ఎన్నికల కమిటీల్లో దిగ్గజ నేతలకు పగ్గాలు అప్పగించింది. కానీ కమిటీలతో రాజకీయంగా ఏం లాభం చేకూరుతుంది...? అసలు కమిటీలను ఎందుకు నియమించినట్లు...? కేవలం అసంతృప్తులను బుజ్జగించేందుకే కమిటీలు వేశారా..? అంటూ పార్టీలో గుసగుసలాడుకుంటున్నారు.
మేనిఫెస్టో అండ్ పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌గా వివేక్ వెంకటస్వామిని, కన్వీనర్‌గా మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కన్వీనర్‌గా కొండా విశ్వేశ్వర్ రెడ్డి, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నియమించింది. పబ్లిక్ మీటింగులకు ఇంచార్జిగా బండి సంజయ్‌ని, చార్జిషీట్ కమిటీ చైర్మన్‌గా మురళీధర్ రావును, ఆందోళనల కమిటీ చైర్మన్‌గా విజయశాంతిని నియమించింది కమలం పార్టీ.. సోషల్ ఔట్ రీచ్ కమిటీ చైర్మన్‌గా కోవ లక్ష్మణ్, INFLUENCER OUT REACH కమిటీ చైర్మన్‌గా డీకే అరుణ, సోషల్ మీడియా చైర్మన్‌గా ఎంపీ అర్వింద్, ఎలక్షన్ కమిషన్ ఇష్యూల కమిటీ చైర్మన్‌గా మర్రి శశిధర్ రెడ్డి, హెడ్ క్వార్టర్స్ కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్‌గా నల్లు ఇంద్రసేనారెడ్డి, మీడియా కమిటీ చైర్మన్‌గా రఘునందన్ రావును నియమించింది. క్యాంపెయిన్ కమిటీ చైర్మన్‌గా వదిరే శ్రీరామ్, ఎస్ సీ నియోజకవర్గాల కమిటీ చైర్మన్‌గా జితేందర్ రెడ్డి, ఎస్ టీ నియోజకవర్గాల కమిటీ చైర్మన్‌గా గరికపాటి మోహన్ రావును తెలంగాణ కాషాయ పార్టీ నియమించింది. మొత్తం 14 కమిటీలను బీజేపీ అధికారికంగా ప్రకటించింది.
తెలంగాణను ఆరు జోన్లుగా విభజించుకుని.. ఎన్నికల వ్యూహం అమలు చేయాలని కమలం పార్టీ భావిస్తోంది. ఈక్రమంలోనే.. సంస్థాగత కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సునీల్ బన్సల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంచార్జిలు, రాష్ట్ర పదాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బహిరంగ సభలకు ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire