ఎక్కడ ఏ బైపోల్‌ అయినా హరీష్‌ పాగా వెయ్యాల్సిందేనా?

ఎక్కడ ఏ బైపోల్‌ అయినా హరీష్‌ పాగా వెయ్యాల్సిందేనా?
x
Highlights

టిఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు బై పోల్ స్పెషలిష్టా. ఎక్కడ ఏ ఉప ఎన్నిక జరిగిన హరీష్ పాగా వేయాల్సిందేనా. బరిలో ఎవరున్నా సరే గురి పెట్టి షూట్ చేయడంలో...

టిఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు బై పోల్ స్పెషలిష్టా. ఎక్కడ ఏ ఉప ఎన్నిక జరిగిన హరీష్ పాగా వేయాల్సిందేనా. బరిలో ఎవరున్నా సరే గురి పెట్టి షూట్ చేయడంలో హరీష్ దిట్టా అనే పేరొందుకొచ్చింది. ఉద్యమ సమయంలో ఒక పరకాల, ఒక ఘన్ పూర్ ఉప ఎన్నిక ఫలితాలతో షేకింగ్ తో షాకింగిచ్చిన హరీష్ కు ఇప్పుడు మళ్లీ దుబ్బాక పెను సవాల్ గా మారనుందా ఇంతకీ ఏ స్ట్రాటజీతో హరీష్ దుబ్బాక బై పోల్ ను భుజానేసుకున్నారు. బిజెపి, కాంగ్రెస్ కూడా అధికార పార్టీ కాండిటేట్ ను పక్కన పెట్టి కేవలం హరీష్ రావును మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..?

తెలంగాణలో బై ఎలక్షన్ రాగానే అన్ని పార్టీలకు కనిపించేది హరీష్ రావే. టిఆర్ఎస్ అధిష్టానం కూడా హరీష్‌నే రంగంలోకి దింపి, వార్ వన్ సైడ్ చేసే వ్యూహాలకు పదును పెడుతుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, మహామహా నేతలు కాంగ్రెస్ వైపు ప్రచారం చేసిన పరకాల, స్టేషన్ ఘన్‌పూర్ ఉపఎన్నికల్లో హరీష్ రావు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. అభ్యర్థి ఎవరైనా సరే అన్నీ తానై నిలిచి, హరీష్ వర్సెస్ మిగతా పార్టీలు అన్నట్టుగా ఆ ఎన్నికలు నడిచాయి. రాష్ట్ర్రంలో మిగతా బైపోల్స్‌లో కూడా తనదైన ముద్ర వేసి, బైపోల్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు హరీష్. ఇప్పుడు దుబ్బాక ఉప ఎన్నిక టఫ్‌ టాస్క్‌ను హరీష్‌కు అప్పగించింది టీఆర్ఎస్‌ హైకమాండ్.

అయితే ఇప్పుడు ఉద్యమం లేదు. ప్రభుత్వం అధికారంలో వుంది. ప్రత్యేక పరిస్థితులతో దుబ్బాక ఉప ఎన్నికొచ్చింది. దుబ్బాక బైపోల్‌ను అత్యంత చాలెంజ్ గా తీసుకున్న ప్రధాన రాజకీయ పార్టీలు, ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇక గులాబీ పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్, అంతా తానై నడిపిస్తున్నారు. అయితే, ఈసారి బైపోల్‌ స్పెషలిస్ట్‌ ప్లాన్లు వర్కవుటవుతాయా అన్న అంశంపై చర్చ సాగుతోంది. దివంగ‌త ఎమ్మెల్యే రామ‌లింగారెడ్డి స‌న్నిహితుడిగా, సిద్ధిపేటను ఆనుకునే వుండే, దుబ్బాక నియోజకవర్గానికి సన్నిహితుడైన మంత్రి హారీష్ రావుకు, ఈ ఎన్నిక నిజంగా పరీక్షగా మారిందన్న చర్చ జరుగుతోంది.

ఎప్పుడైతే దుబ్బాక బాధ్యతలు అప్పగించారో, అప్పటి నుంచో ప్రత్యేక దృష్టిపెట్టారట హరీష్‌ రావు. పార్టీలో విభేదాలు భగ్గుమన్నా వెంటనే, వాటిని చల్లార్చట. అంతేకాదు కాంగ్రెస్, బీజేపీల నుంచి భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు గులాబీ గూటికి చేరడంలోనూ కీలక పాత్ర పోషించింది హరీషేనట. కార్యకర్తలు కారెక్కడంతో, బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థుల్లోనూ కాస్త దడ మొదలైందట. ఎక్కడికక్కడ హరీష్‌ పకడ్బందీ వ్యూహాలతో దుబ్బాక రణక్షేత్రం మరింత రసవత్తరంగా మారిందట.

దుబ్బాక‌లో టీఆర్ఎస్ ఓడిపోతే, ప్రత్యర్ధుల‌కు పెద్ద అస్త్రమే ఇచ్చిన‌ట్లు అవుతుంది. అందుకే మండ‌లానికో ఎమ్మెల్యేను ఇంచార్జీగా పెట్టారు. నెల‌ల త‌ర‌బ‌డి రాని కొత్త పెన్షన్లు రోజుల వ్యవ‌ధిలో వ‌చ్చేస్తున్నాయి. పెండింగ్ బిల్లులన్నీ క్లియ‌ర్ అయిపోతున్నాయి. అయినా అసంతృప్తి రాగాలు మాత్రం త‌గ్గటం లేదు. టీఆర్ఎస్‌లో ఇప్పుడు సోలిపేట‌, చెరుకు ఫ్యామిలీలు, రెండు పార్టీలుగా మారి, ఇద్దరు అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. పైగా రామ‌లింగారెడ్డి ఉండ‌గానే, ఆయ‌న వ‌ర్గంతో ఎంపీ కొత్త ప్రభాక‌ర్ రెడ్డి వ‌ర్గం విభేదించేది. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డితో పనిచేయించడం హరీష్ బాధ్యత. రామ‌లింగారెడ్డి కొడుకు వ్యవహారంపై అసంతృప్తి బయ‌ట‌ప‌డుతోంది. మరోవైపు చెరుకు ముత్యంరెడ్డి కొడుకు శ్రీనివాస్ రెడ్డి కూడా, తండ్రి సానుభూతి ఓట్లతోనే ప్రచారంలోకి దిగారు. కాంగ్రెస్ కూడా గ్రామాలవారిగా, ఇంచార్జీలను నియమించింది. ఇదే సమయంలో మరో ప్రత్యర్థి, బీజేపీ నేత ర‌ఘునంద‌న్ రావును త‌ట్టుకోవాల్సి ఉంది. కాంగ్రెస్ ఒరిజిన‌ల్ ఓటు బ్యాంకును చీల్చి టీఆర్ఎస్ ను గెలిపించాల్సిన బాధ్యత హ‌రీష్‌పై ప‌డింది. ఇప్పుడుగాక ఇంకెప్పుడు అన్న స్టైల్లో, ర‌ఘునంద‌న్ రావు ప్రచారాన్ని ముమ్మరం చేసేశారు.

టిఆర్ఎస్ కూడా మండ‌లానికో మంత్రిని, నాలుగైదు గ్రామాల‌కో ఎమ్మెల్యేను, గ్రామానికో చైర్మన్ స్థాయి నాయ‌కున్ని పెట్టి మ‌రీ, ఈ ప‌రీక్షలో గ‌ట్టెక్కేందుకు ప్లాన్ చేస్తోంది. హరీషే అంతా తానై చూస్తున్నారు. పకడ్బందీ వ్యూహాలకు పదునుపెట్టారు. టీఆర్ఎస్‌ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన దుబ్బాక బైపోల్‌ను గెలిచి, కేసీఆర్‌కు గిఫ్ట్‌ ఇవ్వాలని తపిస్తున్నారట హరీష్. చూడాలి, మినీ సమరాన్ని తలపిస్తున్న దుబ్బాక బైపోల్‌ ఫలితం ఎలా ఉండబోతోందో.

Show Full Article
Print Article
Next Story
More Stories