Telangana: రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు రాష్ట్రమంత్రుల ఆహ్వానం..

Invitation of State Ministers to Governor at Raj Bhavan
x

Telangana: రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు రాష్ట్రమంత్రుల ఆహ్వానం..

Highlights

*బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు, పాత బిల్లుల ఆమోదానికి గవర్నర్ సుముఖత

Telangana: తెలంగాణ బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగంతోనే మొదలు పెట్టేందుకు మార్గం సుగమమైంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందా? లేదా అనే సస్పెన్షన్ కు తెరపడింది. ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చి హై కోర్టులో వేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను ఉపసంహరించుకుంది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులు వెళ్లి బడ్జెట్ ప్రసంగనికి రావలని గవర్నర్ ని ఆహ్వానించారు..

తెలంగాణలో రాజ్ భవన్ - ప్రగతి భవన్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ క్రమంలో 2023-24 వార్షిక సంవత్సరానికి గాను ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రతిపాదనలకు ఈ నెల 21వ తేదీన గవర్నర్ ఆమోదానికి పంపగా... గవర్నర్ తమిళి సై వాటి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.. ఆర్థిక శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేరుగా తమిళి సైని కలిసి కోరారు. ఈ సందర్భంగా గవర్నర్ తన ప్రసంగం ఉంటుందా అని ఆర్థిక శాఖ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. అంతటితో ఆగకుండా తమిళి సై 29వ తేదీ ప్రభుత్వానికి లేఖ రాశారు. మొత్తంగా 21వ తేదీ నుంచి ఈ అంశం గవర్నర్ పరిధిలో పెండింగ్లో ఉండడంతో చివరకు ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా ఆర్టికల్ 202 ప్రకారం గవర్నర్ కు సంబంధం లేకుండా బడ్జెట్ పెట్టుకోవచ్చని, 173 ప్రకారం ఉభయసభల్లో బడ్జెట్ సందర్భంగా గవర్నర్ ప్రసంగం ఉండాలంటూ చర్చలు జరిగాయి.

తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వం బడ్జెట్ కు అనుమతి ఇవాలని లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ దుష్యంత్ దావే ప్రభుత్వ తరపున వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు తర్వాత... నాటకీయ పరిణామాల అనంతరం బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతోనే మొదలౌతాయని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో తెలిపింది. దీనికి సంబంధించి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. గవర్నర్‌ను విమర్శించవద్దన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ దవే తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వం కోర్టుకు వివరణ ఇవ్వడంతో వివాదానికి తెరపడింది.

ప్రభుత్వం - గవర్నర్ మధ్య సయోధ్య కుదిరిన ఎనిమిదవ సెషన్ ప్రోరోగ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇదే క్రమంలో ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. గవర్నర్ ప్రసంగం పై కూడా చర్చించారు. అనంతరం రాజ్ భవన్ లో గవర్నర్ తమిళ సైతో భేటీ అయ్యారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహ చార్యులు, ఫైనాన్స్ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ని ఆహ్వానించారు..అసెంబ్లీ సమావేశాలు మూడో తేదీన ప్రారంభం కానుండగా 6వ తేదీన 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories