Viveka Murder Case: హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు వివేకా హత్య కేసు నిందితులు.. విచారణ వాయిదా

Investigation in CBI Court on Viveka Murder Case
x

Viveka Murder Case: హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు వివేకా హత్య కేసు నిందితులు.. విచారణ వాయిదా

Highlights

Viveka Murder Case: మార్చి 10న మరోసారి హాజరుకావాలని కోర్టు ఆదేశం

Viveka Murder Case: మాజీమంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసుపై హైదరాబాద్‌ సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. కడప సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న నిందితులు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్‌రెడ్డితో పాటు.. బెయిల్‌ పై ఉన్న ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరిని కోర్టులో హాజరుపర్చారు పోలీసులు. వాదనలు విన్న కోర్టు.. మార్చి 10న మరోసారి హాజరుకావాలని ఆదేశించింది. కడప జైల్లో ఉండే ముగ్గురు నిందితులను.. హైదరాబాద్‌ చంచల్‌గూడ జైల్లో ఉంచాలని సూచించింది. తదుపరి విచారణను మార్చి 10కి వాయిదా వేసింది సీబీఐ కోర్టు.

Show Full Article
Print Article
Next Story
More Stories