డ్రగ్స్ మాఫియా హైదరాబాద్‌‌ను టార్గెట్ చేసిందా?

International Drugs Rocket in Hyderabad | Telugu News
x

డ్రగ్స్ మాఫియా హైదరాబాద్‌‌ను టార్గెట్ చేసిందా?

Highlights

*శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ.125 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్

Drugs Mafia: హైదరాబాద్‌లో డ్రగ్స్ ఇప్పుడు చర్చంతా దీనిపైనే. నైజీరియన్లు, ఆఫ్రికా దేశాల వ్యక్తులు అరెస్ట్. మంబయి, ఢిల్లీ, గోవా రాష్ట్రాల నుంచి లింకులు భాగ్యనగరంలో డ్రగ్స్ దందా గుట్టురట్టు ఇలా నిత్యం వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అసలు నగరంలో ఏం జరుగుతోంది..?

హైదరాబాద్‌లో చాపకింద నీరులా డ్రగ్స్ విస్తరిస్తోంది. ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన పలు ముఠాలు భాగ్యనగరాన్ని సెంటర్‌గా మార్చుకుంటున్నాయి. లక్షలాది మంది విద్యార్థులను మత్తు రొంపిలోకి దింపుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు ఒక్కప్పుడు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ అన్న తరహాలో మత్తు పదార్థాలు సప్లయ్ అవుతున్నాయి. మరోవైపు ఎన్నో ముఠాలు పట్టుబడుతూనే ఉన్నాయి. డ్రగ్స్ డొంకలు కదులుతూనే ఉన్నాయి. కానీ ఏదో ఒక చోట ఆ వాసనలు మాత్రం కంపు కొడుతూనే ఉన్నాయి. ఇటీవల బహుదుర్‌పుర పీఎస్ పరిధిలో ముంబై బేస్డ్ డ్రగ్స్ ముఠాని అరెస్ట్ చేశారు నగర పోలీసులు.

విదేశాల నుంచి వస్తున్న డ్రగ్స్‌కు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు ట్రాన్సిట్ పాయింట్‌గా మారడమే ఇప్పుడు కలకలం రేపుతోంది. క్యాప్సుల్స్‌గా మార్చి కడుపులో దాచి లగేజ్‌లో ఏమార్చి మితిమీరిన తెలివితో కస్టమ్స్‌, DRI అధికారులకే మతిపోగొడుతున్నారు డ్రగ్స్ పెడ్లర్లు. ఆఫ్రికన్ దేశాల నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వస్తున్న డ్రగ్స్‌పై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు హైదరాబాద్ పోలీసులు. జాతీయ ఏజెన్సీ సంస్ధలైన CISF, DRI, ఈడీ, కస్టమ్స్, సీఐ సెల్, లోకల్ పోలీసులతో కలిసి డ్రగ్ పెడ్లర్స్‌పై చర్యలు తీసుకోనున్నారు. NCB అంచనా ప్రకారం ఇతర దేశాల నుంచి సీ-పోర్టుల ద్వారా 70 శాతం, ఎయిర్ పోర్టుల ద్వారా 20 శాతం, బై రోడ్ ద్వారా 10 శాతం డ్రగ్స్ ఇండియాకు వస్తున్నాయి. మొదట మూలాలను దెబ్బ కొట్టాలని, కింద స్థాయిలో డ్రగ్స్ వాడకం పూర్తిగా తగ్గించాలంటున్నారు మాజీ అడిషనర్ DCP రెడ్డన్న.

విద్యార్థులకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎలా వస్తున్నాయి? ఇక్కడ దందా నడిపిస్తున్నదెవరు? డ్రగ్స్‌ మాఫియాకి కింగ్‌ పిన్ ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకాలి. సమస్యను మూలాలతో పాటు పెకిలించాలి. అప్పుడే హైదరాబాద్‌ డ్రగ్స్‌ ఫ్రీ సిటీగా మారుతుందంటున్నారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రధాన కార్యదర్శి పద్మనాభం రెడ్డి. భాగనగరంలో డ్రగ్స్ దందాపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోవడమే దీనికి కారణమని ఆరోపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories