ఫలితాల విడుదలకు సిద్ధంగా ఉన్నాం: తెలంగాణ ఇంటర్ బోర్డు

ఫలితాల విడుదలకు సిద్ధంగా ఉన్నాం: తెలంగాణ ఇంటర్ బోర్డు
x
JNTU exams cancelled (representational image)
Highlights

ఇంటర్ పరీక్షలు నిర్వహించిన నెల లోపలే రావలసిన ఇంటర్ ఫలితాలు లాక్ డౌన్ కారణంగా ఆలస్యం అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారుల కసరత్తుతో ఇంటర్...

ఇంటర్ పరీక్షలు నిర్వహించిన నెల లోపలే రావలసిన ఇంటర్ ఫలితాలు లాక్ డౌన్ కారణంగా ఆలస్యం అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారుల కసరత్తుతో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల జవాబు పత్రాల మూల్యాంకనం ఇప్పటికే పూర్తయింది. దీంతో తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం, ప్రథమ సంవత్సరం ఫలితాలను ప్రభుత్వ ఆదేశాల తర్వాత ఇంటర్ ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. ఫలితాలపై రేపు సాయంత్రంలోగా ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని, ప్రభుత్వం ఆదేశిస్తే ఈ నెల 15న ఫలితాలు విడుదల చేస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.

ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు కూడా తాము సిద్ధంగానే ఉన్నామని జలీల్ పేర్కొన్నారు. ప్రస్తతం బోర్డు అధికారులు స్కానింగ్‌ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ మీడియాతో మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఇక గతేడాది తెలంగాణలో ఇంటర్ ఫలితాలు ఎంతటి తీవ్ర పరిణామాలు సృష్టించాయో తెలిసిందే. ఈసారి అలాంటి పొరబాట్లు పునరావృతం కావని తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు చెబుతోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories