Inter Exams: తెలంగాణలో రద్దు దిశగా ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు

Inter Exams will be Going to be Cancelled in Telangana
x

ఇంటర్ పరీక్షలు (ఫైల్ ఇమేజ్)

Highlights

Inter Exams: ఇప్పటికే సీబీఎస్ఈ పరీక్షలు రద్దు చేసిన కేంద్రం * ప్రశ్నార్ధకంగా మారిన 4,73,967 విద్యార్థుల భవితవ్యం

Inter Exams: దేశ వ్యాప్తంగా సీబీఎస్ఈ పరీక్షలు రద్దు అయ్యాయి. పరీక్షల విషయంలో కేంద్రం ఏమి నిర్ణయం తీసుకుంటుందని ఎదురు చూసిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ నిర్ణయంతో క్లారిటీ వచ్చింది. కానీ, తెలంగాణలో మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఇప్పటికే మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేసినా.. ప్రభుత్వం ఇప్పుడు రెండో సంవత్సరం పరీక్షలను కూడా రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం లాక్‌డౌన్ విధించినందున పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇంకోవైపు.. బ్లాక్ ఫంగస్‌ వ్యాధి ప్రజలకు వణికిస్తోంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేసి ఎఫ్ఏ-1 ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్లు ప్రకటిచారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేశారు. ఇంటర్ ఫస్ట్‌ ఇయర్ లో 4లక్షల 59 వేలకు పైగా విద్యార్థులున్నారు. సెకండ్ ఇయర్ 4లక్షల 73వేలకు పైగా ఉన్నారు. ఇద్దరు కలిపి 9లక్షల 32 కు పైగా విద్యార్థులున్నారు. అయితే ఇప్పుటికే ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ప్రమోట్ కావడంతో.. ఇప్పుడు అందరి టెన్షన్ సెకండ్ ఇయర్ విద్యార్థులపై పడింది. ఈ నేపథ్యంలో సీబీఎస్‌ఈ రద్దు చేయడంతో సెకండ్ ఇయర్ పరీక్షలనూ రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి అధ్యాపక సంఘాలు విజ్ఞప్తి చేశారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు గత విద్యాసంవత్సరంలోని మార్కుల ఆధారంగా పర్సెంటేజీ ఇవ్వాలని కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories