ఒక్క ఇన్‌స్టా పోస్ట్‌.. తల్లిని కోల్పోయిన చిన్నారులకు రూ.21 లక్షల సాయం

మానవతను నిరూపించిన ఒక్క ఇన్‌స్టా పోస్ట్‌.. తల్లిని కోల్పోయిన చిన్నారులకు రూ.21 లక్షల సాయం
x

ఒక్క ఇన్‌స్టా పోస్ట్‌.. తల్లిని కోల్పోయిన చిన్నారులకు రూ.21 లక్షల సాయం

Highlights

Instagram Post: వ్యూస్, లైక్స్ పిచ్చితో యువత వికృత పోకడలకు వేదికైన సోషల్ మీడియా సద్వినియోగం చేస్తే ఎలాంటి ప్రయోజనాలు అందిస్తుందో నిరూపించాడు ఓ యువకుడు.

Instagram Post: వ్యూస్, లైక్స్ పిచ్చితో యువత వికృత పోకడలకు వేదికైన సోషల్ మీడియా సద్వినియోగం చేస్తే ఎలాంటి ప్రయోజనాలు అందిస్తుందో నిరూపించాడు ఓ యువకుడు. కేవలం సంపాదనకే కాదు సాయం చేసేందుకు కూడా సోషల్ మీడియా ఉపయోగపడుతుందని చూపించాడు. తల్లిని కోల్పోయిన చిన్నారుల ఆవేదన ప్రపంచానికి తెలిపి మానవత్వానికి నిదర్శనంగా యువతకు ఆదర్శంగా నిలిచాడు.

మహబూబాబాద్‌ జిల్లా నర్సింహుల పేట మండలం బొజ్జన్నపేట గ్రామానికి చెందిన ఉమ, నరేష్ దంపతులకు రెండున్నరేళ్ల కుమార్తె ఉండగా ఇటీవలే కుమారుడు జన్మించాడు. అయితే కుమారుడు పుట్టిన 18 రోజులకే ఆగస్టు 28న ఉమ బ్రెయిన్ ట్యూమర్‌ కారణంగా మరణించింది. తండ్రికి ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆ చిన్నారులిద్దరినీ తాత, నానమ్మ, పెదనాన్నలు చూసుకుంటున్నారు.

చిన్నారుల గురించి తెలుసుకున్న రఘు అనే యువకుడు వారి పరిస్థితిని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. రఘు ఇన్‌స్టా పోస్ట్ చూసి చలించిపోయిన లక్ష మందికి పైగా దాతలు సాయం చేశారు. మొత్తం 21 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. అనాధల్లా మారిన చిన్నారులకు సాయం చేసిన రఘును ఎస్పీ సుధీర్ రాంనాథ్‌ కేకన్ అభినందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories