TS High Court: తెలంగాణలో భారీ వర్షాలు, వరదల నష్టంపై హైకోర్టు విచారణ

Inquiry In High Court On Heavy Rains And Flood Damage In Telangana
x

TS High Court: తెలంగాణలో భారీ వర్షాలు, వరదల నష్టంపై హైకోర్టు విచారణ

Highlights

TS High Court: డాక్టర్ చెరుకు సుధాకర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ

TS High Court: తెలంగాణలో భారీ వర్షాలు, వరదల నష్టంపై హైకోర్టులో విచారణ జరిగింది. డాక్టర్ చెరుకు సుధాకర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టింది తెలంగాణ హైకోర్టు. వర్షాలకు 41 మంది మృతి, 1.59 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని హైకోర్టు దృష్టికి ప్రభుత్వం తీసుకెళ్లింది. పలు మరణాలను నివేదికలో ప్రస్తావించలేదన్న న్యాయవాది చిక్కుడు ప్రభాకర్.. వాతావరణశాఖ ముందే హెచ్చరించినా ప్రభుత్వం సరిగా స్పందించలేదని కోర్టుకు తెలిపారు. విషజ్వరాల నియంత్రణ చర్యలు చేపట్టడంలేదని లాయర్‌ చిక్కుడు ప్రభాకర్.. కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రెండు రోజుల్లో మరిన్ని వివరాలతో మరో నివేదిక ఇస్తామన్నారు ప్రభుత్వం తరఫు న్యాయవాది. ఇదిలా ఉంటే.. విషజ్వరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

గల్లంతైనవారిని గుర్తించేందుకు తీసుకున్న చర్యలు తెలపాలని, భూపాలపల్లి జిల్లాలోని మృతుల వివరాలు కూడా వెల్లడించాలని ఆదేశించింది. షెల్టర్లు, ఇతర సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్లు ఇచ్చారా..? అని ప్రభుత్వ తరఫు లాయర్‌ను ప్రశ్నించిన హైకోర్టు.. విద్యుత్, ఇంటర్నెట్, ఫోన్ వంటి వ్యవస్థల పునరుద్ధరణ చర్యలు వివరించాలని తెలిపింది. వరద బాధితులకు మనోధైర్యం ఇచ్చేందుకు తీసుకున్న చర్యలు ఏంటని, కడెం ప్రాజెక్టు పరిసర ప్రజల రక్షణకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని సూచించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది హైకోర్టు.

Show Full Article
Print Article
Next Story
More Stories