Telangana: బర్త్‌ డే, డెత్‌ డే సర్టిఫికెట్ల జారీలో వినూత్న మార్పులు

Innovative Changes in the Issuance of Birth and Death Certificates
x

Telangana: బర్త్‌ డే, డెత్‌ డే సర్టిఫికెట్ల జారీలో వినూత్న మార్పులు

Highlights

Telangana: 24 గంటల్లోనే సర్టిఫికెట్లు జారీ చేస్తున్న ప్రభుత్వం

Telangana: మీరు బర్త్‌డే సర్టిఫికెట్ తీసుకోవాలనుకుంటున్నారా..? డెత్‌ డే సర్టిఫికెట్ కోసం తిరిగి తిరిగి అలిసిపోయారా..? అయితే ఇప్పుడా టెన్షన్ లేదు..క్షణాల్లోనే బర్త్, డెత్ సర్టిఫికెట్లను తీసుకోవచ్చు. ఈ తతంతంగం అంతా ఇప్పుడు నిమిషాల్లోనే పూర్తవుతుంది. ఒకప్పటిలా వాటి కోసం ఆసుపత్రులు, స్మశానవాటికల చుట్టూ తిరగాల్సిన అవసరంలేదంటున్నారు తెలంగాణ అధికారులు.

సాధారణంగా ఎవరికైనా బర్త్ సర్టిఫికెట్ తీసుకోవాలన్నా డెత్ సర్టిఫికెట్ కావాలన్నా నిన్నా మొన్నటి వరకు కాళ‌్లరిగేలా తిరగాల్సిందే. బర్త్‌ సర్టిఫికెట్‌కు కనీసం వారం రోజులు డెత్ సర్టిఫికెట్ అయితే నెలల తరబడి వెయిట్ చేయాల్సిందే. తప్పదు అనుకుంటే లంచాలు ఇచ్చి మరీ బర్త్, డెత్ సర్టిఫికెట్లు తీసుకోవాల్పిన పరిస్థితి. అయితే ఈ తతంగానికి చెక్‌పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడంతా నిమిషాల్లోనే ఇప్పటినుంచి కుటుంబసభ్యుల సెల్‌ఫోన్‌కే సర్టిఫికెట్‌ లింక్‌ మెసేజ్ వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను ఇక నుంచి 24 గంటల్లోనే జారీ చేయనున్నారు అధికారులు. మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో గతనెల మార్చి 23 నుంచే ఈ సరికొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ విధానం సక్సెస్ కావడంతో దీనినే కొనసాగిస్తున్నారు.

ఇకనుంచి బర్త్‌డే, డెత్‌ డే సర్టిఫికెట్ల కోసం మున్సిపల్‌ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని మున్సిపల్‌ అధికారులు చెప్తున్నారు. సర్టిఫికెట్ల జారీలో జాప్యం, అవినీతి, నిర్లక్ష్యానికి ఆస్కారం లేకుండా ఇన్‌స్టాంట్‌ రిజిస్ట్రేషన్‌, ఇన్‌స్టాంట్‌ అప్రూవల్‌, ఇన్‌స్టాంట్‌ డౌన్‌లోడ్‌ విధానాన్ని అమలుచేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులకు ప్రత్యేకంగా యూజర్‌ ఐడీలు కేటాయించారు.ఆ ఆసుపత్రుల్లో జన్మించిన శిశువులతో పాటు మరణించిన వారి పూర్తి వివరాలను వెంటవెంటనే అప్‌లోడ్‌ చేస్తూ ఉంటారు. ఆసుపత్రుల్లో కాకుండా ఇంటి దగ్గరే మరణిస్తే డెత్‌ సర్టిఫికెట్లను జారీ చేసేందుకు స్మశానవాటికల నిర్వాహకులకు కూడా యూజర్‌ ఐడీలు కేటాయించారు. ఆసుపత్రులు, స్మశాన వాటికల నిర్వాహకులు నమోదు ప్రక్రియను పూర్తి చేసిన వెంటనే కుటుంబసభ్యుల మొబైల్‌ నెంబర్‌కు మెసేజ్‌తో పాటు ఒక లింక్‌ కూడా వస్తుంది. దానిని క్లిక్‌ చేసి, సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

తెలంగాణ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ విధానంలో ఇప్పటివరకు 2,768 బర్త్‌ సర్టిఫికెట్లు, 167 మరణ ధ్రువీకరణ పత్రాలను జారీ చేశారు. ఈ నూతన విధానం విజయవంతం కావడంతో ఇక పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వాధికారులు కసరత్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories