గ్రామాల అభ్యున్నతికి అందరూ కృషి చేయాలి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

గ్రామాల అభ్యున్నతికి అందరూ కృషి చేయాలి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
x
Highlights

‘పంచాయతీ రాజ్‌ సమ్మేళనం-పట్టణ ప్రగతి’పై ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ఫంక్షన్‌ హాల్లో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు.

'పంచాయతీ రాజ్‌ సమ్మేళనం-పట్టణ ప్రగతి'పై ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ఫంక్షన్‌ హాల్లో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో గ్రామాలు అభివృద్ది కావాలంటే ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన అన్నారు. దీనికోసం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగాల‌ని ప్రజా ప్రతినిధులకు, అధికారుల‌కు ఆయన పిల‌పునిచ్చారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేసి ప్రజాభిమానాన్ని పొందాల‌ని దిశానిర్ధేశం చేశారు.

క్షేత్ర స్థాయి ఇబ్బందులను సమగ్రంగా పరిశీలించిన ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, ఆరోగ్యవంతమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామాల అభ్యున్నతి కోసం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగాల‌ని తెలిపారు. గ్రామాల్లో కనీస వసతుల కల్పన, పరిసరాల పరిశుభ్రత, రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణానికి ప్రాధ్యానత ఇవ్వాలని సూచించారు. అంతే కాకుండా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, మొక్కల పెంపకం ఒక ఉద్యమంలా సాగాలని సూచించారు.

సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఇందులో భాగంగానే పల్లెప్రగతి కార్యక్రమం చేపట్టారని ఆయన అన్నారు. పల్లె ప్రగతి లో గ్రామాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. అభివృద్తిలో అలసత్వం వహిస్తే మీ పదవులకు మీరే బాధ్యులవుతారని స్పష్టం చేసారు. పల్లెప్రగతిలో గ్రామాల్లో గుర్తించిన సమస్యలను పూర్తి చేసేందుకు ఈ పంచాయతీ రాజ్‌ ప్రజాప్రతినిధుల సమ్మేళనం ఎంతో దోహదపడనుందన్నారు.

పట్టణ ప్రగతిలో సమస్యలను గుర్తించి, ప‌రిష్కరించాల‌న్నారు. ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని అప్పుడూ గ్రమాల అభివృద్ధి సాధ్యమవుతుందని వివ‌రించారు. పనిచేయని అధికారులు, ప్రజాప్రతినిధులపై చర్యలుంటాయని ముఖ్యమంత్రి ఖరాఖండిగా చెప్పారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమెల్సీ పురాణం స‌తీష్, ఎమ్మెల్యేలు జోగు రామ‌న్న‌, రాథోడ్ బాపురావు, జ‌డ్పీ చైర్మన్ జనార్దన్, కలెక్టర్‌ శ్రీ దేవసేన, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories