Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లు..వారికి బ్యాడ్ న్యూస్..వేల సంఖ్యలో పేర్లు గల్లంతు

Indiramma Houses:  ఇందిరమ్మ ఇండ్లు..వారికి బ్యాడ్ న్యూస్..వేల సంఖ్యలో పేర్లు గల్లంతు
x
Highlights

Indiramma Houses: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. క్షేత్రస్థాయిలో ఉన్న సర్వేయర్లు వివరాలను సేకరిస్తున్నారు. ప్రత్యేకంగా...

Indiramma Houses: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. క్షేత్రస్థాయిలో ఉన్న సర్వేయర్లు వివరాలను సేకరిస్తున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్ లో ప్రతిదీ ఎంటర్ చేస్తున్నారు. మరోవైపు లబ్ధిదారుల ఎంపిక దిశగా కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందిరమ్మ ఇళ్లపై ప్రజలు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. గ్రామాలకు వెళ్లి మరీ వివరాలను ఎంటర్ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన నెలాఖరులోగా ఇళ్ల మంజూరు ప్రక్రియ ఉంటుందని ప్రకటించారు. అత్యంత పారదర్శకంగా లబ్ధిదారులను గుర్తించనున్నట్లు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల గురించి హాట్ టాపిక్ నడుస్తోంది. ప్రతి ఒక్కరు ఈ ఇండ్ల గురించే చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల గుర్తింపునకు చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలో ఓ కొత్త సమస్య ఇప్పుడు తెరపైకి వచ్చింది. నిజామాబాద్ జిల్లాలో ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నా కూడా తాజాగా ఇంటికి వచ్చే సర్వే చేయలేదని ఓ కుటుంబం పేర్కొంటుంది. అద్దె ఇంట్లో ఉంటున్నామని అయినా కూడా ఇందిరమ్మ ఇండ్ల సర్వే చేయలేదని వాపోయింది.

ప్రజాపాలన దరఖాస్తుల్లో కొత్త ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నామని..అయినా కూడా ఇప్పుడు ఎవరూ వచ్చి సర్వే చేయడం లేదని ఆవేదం వ్యక్తం చేస్తుంది ఆ కుటుంబం. నిజామాబాద్ జిల్లాలో వేల సంఖ్యలో పేర్లు గల్లంతయినట్లు తెలుస్తోంది. ప్రజాపాలన దరఖాస్తులు చాలా మంది కొత్త ఇంటి కోసం టిక్ చేశారని... అయితే వాటిని ఆన్లైన్లో చేసేవారు సరిగా చేయకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

దీంతో కంప్యూటర్ ఆపరేటర్ వల్ల పొరపాటు జరిగి ఉంటే.. దానివల్ల ఇప్పుడు ప్రజలు ఇబ్బంది వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సర్వే ఆన్లైన్ జాబితా ప్రకారమే ఇంటింటి సర్వేకు వెళ్తున్నారు. అందువల్ల ప్రభుత్వం ఇలాంటి వారికి అన్యాయం జరగకుండా చూసేందుకు ఎడిట్ ఆప్షన్ ఇస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా సర్వే సిబ్బంది ఇంటింటికి వెళ్లి అర్హుల వివరాలను యాప్ లో నమోదు చేస్తున్నారు. అయితే ఈ యాప్ లో నమోదు చేసిన వివరాలు పక్కాగా జరుగుతున్నాయా లేదా అని అంశంపై మరోసారి సర్వే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories