దెబ్బతిన్న డీఎన్‌ఏకు చికిత్స పై పరిశోధనలు: ఐఐటీహెచ్

దెబ్బతిన్న డీఎన్‌ఏకు చికిత్స పై పరిశోధనలు: ఐఐటీహెచ్
x
Highlights

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌ (ఐఐటీహెచ్‌) పరిశోధకులు మరో ప్రయోగంలో మరో మెట్టు ఎక్కుతున్నారు.

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌ (ఐఐటీహెచ్‌) పరిశోధకులు మరో ప్రయోగంలో మరో మెట్టు ఎక్కుతున్నారు. దెబ్బతిన్న లేదా పాడైన డీఎన్‌ఏను సరిచేసే (మరమ్మతు) ప్రొటీన్‌ పనివిధానాన్ని ఆవిష్కరించారు. ఈ అధ్యయనాన్ని గువాహటి ఐఐటీ బయో సైన్సెస్‌ అండ్‌ బయో ఇంజనీరింగ్‌ విభాగం ప్రొఫెసర్‌ అరుణ్‌గోయెల్‌ సహకారంతో చేసామని తెలిపారు. ఇదిలా ఉంటే అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అనింద్యారాయ్, మోనిషామోహన్, డాక్టర్‌ అరుణ్‌గోయెల్, అరుణ్‌ థిల్లాన్‌, ఆకుల దీపలు జర్నల్‌లో వచ్చిన డాక్యుమెంట్‌ను రచించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా డాక్టర్‌ అనింద్యారాయ్‌ మాట్లాడుతూ శరీరంలో సహజంగా ఉత్పత్తయ్యే కొన్ని రకాల రసాయనాలు డీఎన్‌ఏకు నష్టాన్ని కలిగిస్తాయని తెలిపారు. ఈ క్రమంలోనే దెబ్బతిన్న డీఎన్‌ఏకు చికిత్స అందించడానికి పరిశోధనలు చేపట్టారని తెలిపారు. కేన్సర్‌ వంటి వ్యాధులు డీఎన్‌ఏకి ఏదైనా నష్టం జరగడం వలన సంభవిస్తాయని తెలిపారు. కాబట్టే ఈ పరిశోధనలు చేసామని తెలిపారు. ఈ పరిశోధనలకు భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం, సైన్స్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇంజనీరింగ్‌ బోర్డు (ఎస్‌ఈఆర్‌బీ) నిధులను సమకూరుస్తున్నట్లు తెలిపారు. ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు పీర్‌–రివ్యూ జర్నల్‌ 'న్యూక్లియిక్‌ యాసిడ్‌ రీసెర్చ్‌'లో ప్రచురితమైనట్లు ఐఐటీహెచ్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories