విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ ఇండియా కూటమి నిరసన

India Alliance Protests Against Suspension of Opposition MPs
x

విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ ఇండియా కూటమి నిరసన

Highlights

Congress: ఇవాళ దేశ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన ఇండియా కూటమి

Congress: పార్లమెంట్‌లో ఇండియా కూటమి ఎంపీలపై అక్రమంగా సస్పెన్షన్ వేటు వేశారని నిరసిస్తూ ఇవాళ దేశ వ్యాప్తంగా ఇండియా కూటమి నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీల నేతృత్వంలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీల ఆధ్వర్యంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధర్నా చేపట్టనున్నారు. ఇండియా కూటమి నేతలు భారీగా పాల్గొనాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్‌గౌడ్ పిలుపునిచ్చారు.

అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఇండియా కూటమితో కలిసి కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ధర్నాలు చేయాలని ఆదేశించారు. పార్లమెంట్‌లో ఇండియా కూటమి ఎంపీలను అక్రమంగా, అప్రజాస్వామికంగా సస్పెండ్ చేశారనే అంశాలపై ఇండియా కూటమి నిరసన తెలియజేయనుంది. పార్లమెంట్‌లో స్మోక్ కలర్ ఘటన అంశంలో కేంద్రహోంమంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో ప్రకటన చేయాలని ఇండియా కూటమి చర్చకు పట్టుబట్టింది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎంపీలను సస్పెండ్ చేయడం దారుణమంటూ ఇండియా కూటమి నేతలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళనలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories