Corona: భయం గుప్పిట్లో సాగర్ జనం

Increasing Corona Cases day by day in Nagarjuna Sagar
x

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Corona: నిన్న ఒక్కరోజే 250 కేసులు * కరోనా టెస్టుల కోసం క్యూకడుతున్న ప్రజలు

Corona: నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజురోజుకూ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే సాగర్ లో 250 కేసులు నమోదయ్యాయి. ఉప ఎన్నిక బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు, నేతలకు ఒకరొకరుగా కరోనా నిర్ధారణ అవుతోంది. సాగర్ కమలా నెహూ ఆస్పత్రి, త్రిపురారం, నెల్లికల్లు, జమ్మనకోట తండా, హాలియా, గుర్రంపోడు, పీఏ పల్లి, పెద్దవూర సెంటర్లలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ప్రచారంలో కరోనా నిబంధనలను యధేచ్ఛగా ఉల్లంఘించిన పలు పార్టీలు గుంపులు గుంపులుగా చేసిన ర్యాలీలు, ఊరేగింపులతో కేసులు ఉద్ధృతమయ్యాయి.

సాగర్‌ నియోజకవర్గంలో అధికారికంగా ఈనెల 19న 160 కేసులు, నిన్న 250 కేసులు నమోదయ్యాయి. అయితే, అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా చాలా ఎక్కువ ఉంటుందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. సీఎం సభలో పాల్గొన్నవారు, రోడ్డు షోలు, ప్రచారంలో పాల్గొన్న నేతలు, వారి కార్యకర్తలు బస చేసిన ఇళ్లు, ఫాంహౌ్‌సలు అన్నీ కరోనా హాట్ స్పాట్స్ గా మారాయి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి, ఆయన భార్య నివేదితారెడ్డి, తిరుమలగిరి, బోయగూడెం కాంగ్రెస్‌ నాయకులు గడ్డం సాగర్‌ రెడ్డి, శ్రీధర్‌ రెడ్డి, చంద్రశేఖర్‌ కు కరోనా పాజిటివ్ వచ్చింది. సీఎం ప్రచార సభను కవర్‌ చేసేందుకు వెళ్లిన ఆరుగురు జర్నలిస్టులు కరోనాతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు.

నాగార్జునసాగర్ బై ఎలక్షన్స్ ప్రచారం ప్రారంభమైన మార్చి ఒకటి నుంచి.. ఈనెల 15వ తేదీవరకు 45 రోజుల్లో నియోజకవర్గంలో సుమారు 2 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున నాయకులు తరలి వచ్చారని, ప్రధానంగా హైదరాబాద్‌ నుంచి ప్రతిరోజూ పెద్దసంఖ్యలో రాకపోకలు కొనసాగించారని, ఫలితంగానే కేసులు పెరిగాయని వైద్యఅధికారులు చెబుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories