Cold Intensity: చలితో గజగజ.. తెలుగు రాష్ట్రాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు..

Increasing Cold In Telugu States Temperatures
x

Cold Intensity: చలితో గజగజ.. తెలుగు రాష్ట్రాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు..

Highlights

Cold Intensity: బయటకు రావాలంటేనే జంకుతున్న జనాలు

Cold Intensity: తెలుగు రాష్ర్టాల్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతుంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తెలంగాణలో ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి చేరుకుంటున్నాయి. దీంతో తెలంగాణపై చలి పంజా విసురుతోంది. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరగడంతో పాటు మంచు కురుస్తోంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో తెల్లవారు జామున దట్టమైన పొగ మంచు కమ్ముకుంటోంది. సాయంత్రం 5 గంటల నుంచి మొదలు పెడితే ఉదయం 9 గంటలు దాటినా చలి తీవ్రత తగ్గడం లేదు. ఉదయం 9 గంటల వరకు పలు ప్రాంతాల్లో మంచు దుప్పటి వీడటం లేదు. దీంతో జనాలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతోపాటు చలిగాలులు కూడా వీస్తుండడంతో ప్రజలు చలికి గజ గజ వణికిపోతున్నారు.

భద్రాద్రి- కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్‌, నల్లగొండ జిల్లాల్లో దట్టంగా మంచు కురుస్తున్నది. మెదక్‌లో అత్యల్పంగా, అత్యధికంగా మహబూబ్‌నగర్‌లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిజామాబాద్‌, కరీంనగర్ ప్రాంతాల్లో చలి వణుకు పుట్టిస్తున్నది. ఆదిలాబాద్‌ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏజెన్సీ ఏరియా లు, అరకు ప్రాంతంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపో వడంతో పర్యాటకుల సంఖ్య తగ్గింది. లంబసింగిలో మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories