తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తనిఖీల ముమ్మరం.. 720 చీరలను స్వాధీనం చేసుకున్న ఎన్నికల అధికారులు

In The Wake Of The Telangana Assembly Elections, Inspections Are Ramping Up
x

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తనిఖీల ముమ్మరం.. 720 చీరలను స్వాధీనం చేసుకున్న ఎన్నికల అధికారులు

Highlights

Telangana: ఎన్నికల నియామవళికి విరుద్ధంగా చీరలు పంపిణీ చేయొద్దని నోటీసులు

Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు సోదాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఇంట్లో ఎన్నికల అధికారులు ఆదివారం రాత్రి సోదాలు చేపట్టారు. ఎన్నికల నియామవళికి విరుద్ధంగా చీరలు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారనే సమాచారంతో పోలీసులతో కలిసి జాయింట్ సెర్చ్ నిర్వహించారు. సోదాల్లో భాగంగా 720 చీరలను స్వాధీనం చేసుకున్నారు. ఇక అధికారుల సోదాలపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం బీజేపీ నాయకులే టార్గెట్ గా పోలీసులు, అధికారులు విధులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నేతల ఇళ్లల్లో సోదాలు చేసినట్లు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల ఇళ్లల్లో ఎందుకు తనిఖీలు చేయడంలేదని ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories