Online Classes : ఆన్‌లైన్‌ క్లాసుల కోసం ఓ విద్యార్ధి ఏం చేసాడో తెలుసా ?

Online Classes : ఆన్‌లైన్‌ క్లాసుల కోసం ఓ విద్యార్ధి ఏం చేసాడో తెలుసా ?
x
Highlights

Online Classes : చాలా మంది విద్యార్ధులకు చదువుకోవడానికి అన్ని సౌకర్యాలు ఉన్నా వారు మాత్రం చదువును నిర్లక్ష్యం చేస్తారు. మరి కొంత మంది విద్యార్ధుల...

Online Classes : చాలా మంది విద్యార్ధులకు చదువుకోవడానికి అన్ని సౌకర్యాలు ఉన్నా వారు మాత్రం చదువును నిర్లక్ష్యం చేస్తారు. మరి కొంత మంది విద్యార్ధుల పరిస్థితి ఎలా ఉంటుందంటే చదువుకుందాం అన్న ఆశ, తపన ఉన్నా వారి స్థితిగతులు, ఆర్థిక ఇబ్బందులు వారి చదువు ఆటంకంగా మారుతాయి. కానీ ఆ విద్యార్ధులు పరిస్థితులను పక్కనపెట్టి వారు చదువుకోవాలన్న ఆశను సాకారం చేసుకునేందుకు కష్ట పడతారు. చివరికి వారు కళను విజయవంతంగా నెరవేర్చుకుంటారు. ఆ కోవకు చెందిన విద్యార్ధ్యే సిర్రం శివరాం. చదువుకు పేదరికం, ఆర్థిక స్థితిగుతులు ఏవీ అడ్డు కావని తెలిపాడు.

ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తున్ననేపథ్యంలో పాఠశాలలు తెరవకుండా ఆన్ లైన్ విద్యను విద్యార్ధులకు అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆయా పాఠశాలలు ఆన్ లైన్ క్లాసుల బోధనను ప్రారంభించింది. అయితే చాలా మంది విద్యార్ధులకు స్మార్ట్ ఫోన్, అలాగే ఇంట్లో టీవీ లేకపోవడం వలన క్లాసులను వినలేకపోతున్నారు. సిర్రం శివరాం పరిస్థితి కూడా అదే. కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం ఒద్యారం గ్రామానికి చెందిన శివరాం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. కాగా అతని తండ్రి మల్లయ్య కూలీ పనిచేస్తుండగా, తల్లి వెంకవ్వ దివ్యాంగురాలు. ప్రస్తుతం ఆన్ లైన్ పాఠాలు ప్రారంభం కావడం, అతనికి ఫోన్‌ లేకపోవడంతో వినలేని పరిస్థితి. పేదరికం కారణంగా చేతిలో సెల్‌ఫోన్‌ లేకపోవడంతో ఒకింత నిరాశకు గురయ్యాడు. ఎలాగైనా ఆన్ లైన్ క్లాసులను వినాలనే తపనతో స్మార్ట్ ఫోన్ ఫోను కొనుగోలు చేయాలనుకున్నాడు. అందుకోసం దాదాపుగా మూడునెలలపాటు కూలి పనులు చేసి డబ్బును కూడబెట్టాడు. పైసాపైసా కూడబెట్టి రూ.9 వేలతో ఇటీవల ఓ స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేశాడు. స్వయంకృషితో కొనుకున్న ఫోన్‌లో శనివారం ఆత్మవిశ్వాసంతో ఆన్‌లైన్‌ పాఠాలు వింటూ కనిపించాడు. చదువుకునేందుకు పేదరికం అడ్డుకాదని నిరూపించిన శివరాంను గ్రామస్థులు అభినందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories