Tomato Price: కొండెక్కిన టమాటా..కిలో రూ. 100కు చేరువ

In Hyderabad market Rs. 100 per kg tomato price
x

Tomato Price: కొండెక్కిన టమాటా..కిలో రూ. 100కు చేరువ

Highlights

Tomato Price: టమాటా ధర కొండెక్కి కూర్చొంది. సామాన్యులకు అందనంతగా పెరిగిపోతుంది. కిలో ధర రూ. 100 చేరువ్వవడంతో టమాటా టాటా చెప్పే సమయం వచ్చిందంటున్నారు సామాన్య మధ్య తరగతి ప్రజలు.

Tomato Price Hike:సామాన్య, మధ్య తరగతి ప్రజలకు టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. కిలో ధర రూ. 100 చేరువ్వవడంతో టమాటాతో తమకు పనిలేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం వండుకునే ప్రతి కూరలో టమాటా ఉండాల్సిందే. అలాంటి టమాటా ధర భారీగా పెరిగే సరి..ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్నారు.

హైదరాబాద్ రైతు బజార్లలోనూ నిర్ణయించిన ధరకు మించి విక్రయాలు సాగిస్తున్నారు. కిలో రూ. 51 ఉంటే రూ. 70 అమ్ముతున్నారంటూ వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ఇదంటేని ప్రశ్నిస్తే పుచ్చులు, మచ్చలున్న మెత్తటి టమాటాలు తీసుకోవాలంటున్నారని వాపోతున్నారు. రైతు బజార్లలోనే ఇలా ఉంటే బహిరంగ మార్కెట్లో ధర రూ. 90 నుంచి రూ. 100 వరకు విక్రయిస్తున్నారు.

ప్రతిరోజూ నగరంలోని రైతు బజార్లకు 6వేల క్వింటాళ్ల టమాటాలు వస్తుండేవి. అయితే తొలకరి పంట సరైన సమయానికి చేతికందక పోవడంతో ప్రస్తుతం 2.5 నుంచి 3వేల క్వింటాళ్లు మాత్రమే వస్తున్నాయి. దీంతో డిమాండ్ పెరిగింది. డిమాండ్ పెరగడంతో ధర కూడా పెరిగింది.

సెప్టెంబర్ వరకు దిగుబడి వచ్చే ఛాన్స్ లేకపోవడంతో ధరలు ఇలాగే ఉండే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. నగర శివారులోని యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం రైతుల నుంచి కూడా టమాటా పెద్దగా మార్కెట్లోకి రావడం లేదు. దీంతో టమోటా ధరలకు రెక్కలు వచ్చాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories