Corona Updates: హైదరాబాద్ లో 54శాతం మందిలో యాంటీబాడీలు

In Hyderabad, 54 percent of people have Antibodies
x

ఫైల్ Image

Highlights

Corona Updates: హైదరాబాద్ నగరంలో 54శాతం మందిలో యాంటీబాడీలు తయారైనట్లు గుర్తించామని సీసీఎంబీ తెలిపింది

Corona Updates: హైదరాబాద్ నగరంలో 54శాతం మందిలో యాంటీబాడీలు తయారైనట్లు గుర్తించామనిరాజధాని పరిధిలో సీసీఎంబీ, జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌), భారత్‌ బయోటెక్‌ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సీరో అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడైనట్లు సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. హైదరాబాద్‌ నగరంలో సంగం మంది ప్రజలకు కరోనా వచ్చి పోయిందని సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ సంస్థ తెలిపింది. (సీసీఎంబీ) కరోనా సోకినప్పటికీ ఎలాంటి లక్షణాలు లేకపోవడమే దీనికి కారణమని కూడా పేర్కొంది. ఇప్పటివరకు నాలుగు సార్లు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈ సీరో అధ్యయనం నిర్వహించామన్నారు. ఈసారి అత్యధికంగా 150 వార్డులకు గాను 30 వార్డుల నుంచి 9 వేల మందితో అతిపెద్ద సమూహ అధ్యయనం నిర్వహించినట్లు తెలిపారు. వైరస్‌ ఇంకా మన చుట్టూనే ఉందని, నిర్లక్ష్యం చేస్తే లెక్కలన్నీ మారే అవకాశముందని ఆయన హెచ్చరించారు.

కనిపించని రీఇన్‌ఫెక్షన్‌..

నగరంలో ఇప్పటికే కరోనా సోకి కోలుకున్న వారిలో రీఇన్‌ఫెక్షన్‌ కనిపించడం లేదని రాకేశ్‌ మిశ్రా తెలిపారు. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోల్చితే ఇక్కడ వైరస్‌ విస్తృతి, తీవ్రత రెండూ తక్కువగా ఉన్నాయన్నారు. దాదాపు 80 శాతం మందికి తట్టుకునే సామర్థ్యం వచ్చిందన్నారు. ప్రస్తుతం ఉన్న యాంటీబాడీల శాతం టీకాలతో రెట్టింపు అయ్యే అవకాశముందని రాకేశ్‌ మిశ్రా తెలిపారు.

అత్యధికంగా 70 శాతం, అత్యల్పంగా 30 శాతం మందిలో..

వారు నిర్వహించిన సర్వేలో కొన్ని ప్రాంతాల్లోఅత్యధికంగా 70 శాతం, అత్యల్పంగా 30 శాతం మందిలో యాంటీబాడీల ఉత్పత్తి ఉంది. చిన్న గదుల్లో ఉంటున్న వారిలో ఎక్కువ మందికి, విశాల ప్రాంతాల్లో ఉంటున్న వారిలో తక్కువ మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. కుటుంబాల ద్వారా సోకిన వారిలో 78 శాతం మందికి, బయట సమూహాల ద్వారా సోకిన వారిలో 68 శాతం మందిలో యాంటీబాడీస్ సమృద్ధిగా ఉన్నాయి. మహిళల్లో 56 శాతం మందిలో యాంటీబాడీలు ఉండగా.. పురుషుల్లో 53 శాతం మందిలో ఉన్నాయి. 70 ఏళ్ల వయసు పైబడిన వారిలో 49 శాతం మాత్రమే యాంటీబాడీలున్నట్లు తేలింది.

Show Full Article
Print Article
Next Story
More Stories