Weather Update: ఏపీ, తెలంగాణ ప్రజలకు అలర్ట్..ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు..!

heavy-rains-predicted-across-telangana-for-next-four-days-red-alert
x

Heavy Rains: భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. పది జిల్లాలకు రెడ్ అలర్ట్

Highlights

Weather Update: ఏపీ, తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేడు, రేపు ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

Weather Update: భారత వాతావరణ శాఖ ఏపీ, తెలంగాణ ప్రజలను అలర్ట్ చేసింది. తాజాగా విడుదల చేసిన వాతావరణ బులిటెన్ లో నైరుతీ రుతుపవనాలు జోరుగా ఉన్నాయని పేర్కొంది. మరో నాలుగు రోజులు పాటు కోస్తాంధ్రలో నైరుతీ రుతుపవనాలు విస్తరిస్తాయని తెలిపింది. ఈశాన్య అరేబియాలో తుఫాన్ సర్క్యూలేషన్ అలాగే ఉందని..గోవా నుంచి కోస్తాంధ్ర వరకు ద్రోణి ఆవరించి ఉన్నట్లు తెలిపింది. దీంతో రానున్న 5 రోజులపాటు కోస్తాంధ్ర,యానాం, రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, పిడుగులు కూడా పడే అవకాశం ఉందని తెలిపింది. వర్షాలు పడే సమయంలో గాలి 30 నుంచి 40కిలోమీటర్ల్ వేగంతో వీస్తుంది.కాగా 18, 19 తేదీల్లో కోస్తాంధ్ర, యానాంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఇక ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్రలో జల్లులు మొదలై క్రమంగా పెరుగుతుంటాయి. సాయంత్రం 5గంటల తర్వాత ఉత్తర తెలంగాణకు భారీ వర్ష సూచనలు జారీ చేసింది. హైదరాబాద్ లో కూడా భారీ వర్షం పడుతుందని తెలిపింది. ఏపీలో తీరప్రాంతమంతా జల్లులు పడతాయని..కోస్తాలో మోస్తారు వాన పడే అవకాశం ఉందని వెల్లడించింది. వర్షం పడే సమయంలో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా మేఘాలు కమ్ముకుని ఉంటాయి...పగలు ఎండలు ఉన్నా సాయంత్రం వరకు వాతావరణం చల్లబడి వర్షం కురుస్తుందని పేర్కొంది. సాయంత్రం 4 తర్వాత ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ లో భారీ వర్షం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఇక తెలంగాణలో సగటున 34 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అవుతుందని చెప్పారు. మధ్యాహ్నం వరకు ఉత్తర తెలంగాణలో ఎండలు ఉంటాయని..ఆ తర్వాత వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. వర్షాలు కురిసే చోట తేమ పెరిగి..ఉక్కపోత ఉంటుందని తెలిపారు. పశ్చిమం నుంచి వచ్చే గాలుల వేగం పెరగడంతో..ఉక్కపోత తగ్గుతుందని ఐఎండీ అధికారులు స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories