తెలంగాణలో జూన్ నుంచి కరోనా కేసులు పెరగవు: ఐఐటీ ప్రొఫెసర్స్
Telangana Covid Cases: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. అలానే పలు రాష్ట్రాల్లో పరిస్థితి కూడా చేయి దాటిపోతోంది. ఈ క్రమంలో తెలంగాణలోకూడా...
Telangana Covid Cases: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. అలానే పలు రాష్ట్రాల్లో పరిస్థితి కూడా చేయి దాటిపోతోంది. ఈ క్రమంలో తెలంగాణలోకూడా నిత్యం వేల సంఖ్యలో పాజిటీవ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో కరోనా కేసుల విషయంలో ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మనీంద్రా అగర్వాల్.. జూన్ నుంచి కరోనా కేసులు తగ్గుతాయని పేర్కొంటున్నారు.
తెలంగాణలో ఊహించిన దాని కంటే కొంచెం అటు ఇటుగా ఫలితాలు రానున్నట్లు తెలిపారు. కంప్యూటేషనల్ మోడల్ తో ఆయన ఈ ఫలితాను వెల్లడించారు. దీని ప్రకారం..మే20 నుంచి జూన్ 21 నాటికి క్రమంగా కేసుల సంఖ్య తగ్గి, ఆ తరువాత ఒకేలా మెయింటైన్ అవుతాయన్నారు.
మే 12నుంచి మే20వరకు భారీగా కేసులు పెరుగుతాయని హెచ్చరించారు. అలాగే జూన్ 12న తర్వాత ఈ సంఖ్య తగ్గుతుందని వెల్లడించారు. ఐటీ కాన్పూర్, ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ల టీం ఈ మోడల్ తో అంచాలను ప్రకటించాయి. రాష్ట్రంలో ఈ మధ్యనే 10వేల కేసులు నమోదు అయ్యాయి. 10వేల మార్కు చేరిన తర్వాత కేసుల సంఖ్య 6వేల 500 నుంచి 8వేలకు మధ్యలోనే ఉండాలని ప్రొఫెసర్లు పేర్కొంటున్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire