కంటికి కనిపించని కరోనా వైరస్ దేశాన్ని అతలాకుతలం చేస్తుంది. ఈ క్రమంలోనే ఆరు ఐఐటీల డైరెక్టర్లతో...
కంటికి కనిపించని కరోనా వైరస్ దేశాన్ని అతలాకుతలం చేస్తుంది. ఈ క్రమంలోనే ఆరు ఐఐటీల డైరెక్టర్లతో కూడిన సబ్ కమిటీ ఐఐటీల్లో అన్ని కోర్సులకు సంబంధించిన ప్రథమ సెమిస్టర్‌ను ఆన్లైన్లోనే నిర్వహించాలని సిఫారసు చేసింది. ఒకవేళ విద్యార్థులు ఈ ఆన్ లైన్ సెమిస్టర్ ను వద్దనుకుంటే వారికి ఒక సెమిస్టర్ లేదా విద్యా సంవత్సరం ఆగిపోయేలా అవకాశమివ్వాలని పేర్కొంది. ఐఐటీల కౌన్సిల్ స్టాడింగ్ కమిటీని కరోనా వైరస్ కాస్త తగ్గుముఖం అయిన తరువాత ఐఐటీల్లో విద్యా కార్యక్రమాలు, పరీక్షలకు నిర్వహించాల్సిన కార్యాచరణను అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసారు. కాగా ఈ సబ్ కమిటీ తమ నివేదికను స్టాండింగ్ కమిటీకి అందజేసింది. దాన్ని పరిశీలించిన ఐఐటీల కౌన్సిల్ స్టాడింగ్ కమిటీ అతి త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది.
2019–20 విద్యా సంవత్సరపు రెండో సమిస్టర్ వారికి ఆన్లైన్లో పరీక్షలు ఇతరత్రా విద్యా కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొంది. పీజీ కోర్సుల్లో చేరే విద్యార్థులకు డిసెంబర్లో లేదా వచ్చే జనరిలోనే విద్యా కార్యక్రమాలను ప్రారంభించాలని పేర్కొంది. కేవలం పీహెచ్డీ విద్యార్థులకు మాత్రమే అదీ ఆన్లైన్ సదుపాయం లేని వారిని పరిమితంగా క్యాంపస్‌లకు అనుమతించాలని వెల్లడించింది. ల్యాబ్ కార్యక్రమాలను అన్నింటిని ఇప్పుడు రద్దు చేసి, 2021 వేసవిలో రెండు, మూడు వారాల ఇంటెన్సివ్ ప్రోగ్రాం నిర్వహించాలని వివరించింది. ఇక బీటెక్ వంటి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో జేఈఈ షెడ్యూల్ ప్రకారం ప్రవేశాలు చేపట్టాలని పేర్కొంది. ప్రథమ, ద్వితీయ, తృతీయ సెమిస్టర్లలో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా బ్రాంచిని ఎంచుకునే అవకాశం కల్పించాలని తెలిపింది.
నివేదికలోని ప్రధాన అంశాలు..
- బీటెక్, ఎంటెక్ ప్రాజెక్టులను థియరీ విధానంలో, ఆన్లైన్ ద్వారా చేపట్టాలి.
- అక్టోబర్‌లో పరిస్థితిని మరోసారి సమీక్షించి నిర్ణయం తీసుకోవాలి.
- పీజీ ప్రవేశాలు ఇప్పుడు నిలిపేయాలి.
- ఆన్లైన్ సెలెక్షన్స్ ఉండవు. పీజీ అకడమిక్ ఇయర్ డిసెంబర్లో లేదా జనవరిలోనే ప్రారంభించాలి.
- యూజీ ప్రథమ సెమిస్టర్ విద్యా కార్యక్రమాలు ఆన్లైన్లోనే నిర్వహించాలి.
- ఆన్లైన్ క్విజ్లు, ఆన్లైన్ పరీక్షలు వైవాల ద్వారా మూల్యాంకనం చేయాలి.
- విద్యార్థులకు ఇష్టం లేకపోతే సెమిస్టర్, విద్యా సంవత్సరం ఆపేసుకోవచ్చు
- రెండేళ్ల పీజీని 18 నెలలకు కుదించాలి. ఎంబీఏ, సంబంధిత ఇతర కోర్సుల ప్రథమ సెమిస్టర్ల బోధనను ఆన్లైన్లో చేపట్టాలి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire