ఆదర్శంగా నిలుస్తున్న హైదరాబాద్‌ బోయిన్‌పల్లి మార్కెట్‌

Ideally located Hyderabad Boinpalli Market
x

Hyderabad Bowenpalli Market

Highlights

విద్యుత్‌ ఉత్పత్తికి కాదేది అనర్హం అని ప్రూ చేస్తున్నారు హైదరాబాద్‌ బోయిన్‌పల్లి మార్కెట్‌ నిర్వాహకులు. మార్కెట్‌లో వాడే కరెంట్‌ను స్వతహాగా ఉత్పత్తి...

విద్యుత్‌ ఉత్పత్తికి కాదేది అనర్హం అని ప్రూ చేస్తున్నారు హైదరాబాద్‌ బోయిన్‌పల్లి మార్కెట్‌ నిర్వాహకులు. మార్కెట్‌లో వాడే కరెంట్‌ను స్వతహాగా ఉత్పత్తి చేస్తున్నారు. పైగా క్యాంటీన్‌లో వాడే గ్యాస్‌ను కూడా సొంతంగా రెడీ చేసి వంటకాలు చేస్తున్నారు. ఏకంగా ప్రధాని మోడీ నుంచే ప్రశంసం అందుకున్నారు. ఇంతకీ మార్కెట్‌లో విద్యుత్‌ తయారీ ఎలా సాధ్యమవుతోంది. కూరగాయల వ్యర్థాలతో వాళ్లు ఏం చేస్తున్నారు.

ఇప్పుడు దేశమంతా హైదరాబాద్‌ బోయిన్‌పల్లి మార్కెట్ పేరును జపిస్తుంది. ఎందుకంటే ప్రధాని మోడీ మాన్‌కీబాత్‌లో బోయిన్‌పల్లి మార్కెట్‌ ఘనతను ప్రస్థావించారు. కూరగాయల వ్యర్థాల నుంచి విద్యుత్‌ చేయడం తెలుసుకొని ఆశ్చర్య వ్యక్తం చేశారు. బోయిన్‌పల్లి మార్కెట్‌ మనందరికీ ఆధర్శమంటూ కొనియాడారు.

కూరగాయల మార్కెట్‌ అంటే వ్యర్థాలు ఉండడం కామన్.. ఆ వ్యర్థాలతో గాలి కాలుష్యం ఖాయం. ఆ నష్టాలకు చెక్‌ పెట్టేందుకు బోయిన్‌పల్లి మార్కెట్‌లో బయోఎనర్జీ ప్లాంట్‌ ను ఏర్పాటు చేశారు. మార్కెట్‌లోని కూరగాయల వ్యర్థాలతో ఇక్కడ విద్యుత్‌ ఉత్పత్తిని చేస్తున్నారు. ప్రస్తుతం ట్రయల్‌ రన్ నడుస్తోంది. త్వరలో ఈ ప్లాంట్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు. ప్రతిరోజూ 10 టన్నుల చెత్త నుంచి 500 యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. విద్యుత్‌తోపాటు 30 కిలోల బయో ఫ్యూయల్ ఉత్పత్తి చేస్తున్నారు.

బోయిన్‌పల్లి మార్కెట్‌లో నిత్యం 10వేల కిలోల వ్యర్థాలు పేరుకపోతాయి. వాటిని డంపింగ్ యార్డ్‌కు తరలించేవారు. కానీ ఇప్పుడు విద్యుత్‌ ఉత్పత్తి, బయోగ్యాస్ తయారీకి వినియోగిస్తున్నారు. కేంద్రం 2 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయాల ఖర్చుతో ఈ ప్లాంట్ ఏర్పాటు చేశారు.

ఫిబ్రవరి 2020లో ప్రారంభించిన ఈ బయోగ్యాస్ ప్లాంట్ ఇప్పుడు సక్సెస్‌ అయింది. త్వరలో గుడిమల్కాపూర్, గడ్డిఅన్నారం, ఎర్రగడ్డ మార్కెట్‌లో సైతం బయోప్లాంట్ ప్రారంభించనున్నట్లు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్ధలు వెల్లడించాయి. చెత్తను వినియోగించి, విద్యుత్ తయారు చేయడంపై దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ఇలాంటి టెక్నాజీ ఆధారంగా పర్యావరణ కాలుష్యాన్ని నివారిస్తూనే ప్రయోజనాలు పొందవచ్చని అంటున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories