Amrapali Kata: ఆమ్రపాలికి దక్కని ఊరట..ఏపీలో రిపోర్ట్ చేయాలి: హైకోర్టు

Amrapali Kata
x

ఆమ్రపాలికి దక్కని ఊరట

Highlights

Amrapali Kata: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించలేదు.

Amrapali Kata: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి సహా ఐఎఎస్ అధికారులు తమకు కేటాయించిన రాష్ట్రాల్లో ముందు రిపోర్ట్ చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.ఐఎఎస్ లు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు డిస్మిస్ చేసింది.

క్యాట్ ఆదేశాలను తెలంగాణ హైకోర్టులో ఆమ్రపాలి, రోనాల్డ్ రోస్, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్ లు బుధవారం సవాల్ చేశారు. వాదనల సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ట్రిబ్యునల్ కొట్టెస్తే కోర్టులకు రావడం సరైంది కాదని కోర్టు వ్యాఖ్యానించింది. క్యాట్ ఉత్తర్వులపై స్టే ఇస్తూపోతే ఈ అంశం ఎప్పటికీ తేలదని న్యాయస్థానం అభిప్రాయపడింది.

వివాదాన్ని తేలుస్తాం.. ముందైతే కేటాయించిన రాష్ట్రాల్లో విధుల్లో చేరాలని హైకోర్టు సూచించింది. బాధ్యతాయుతమైన అధికారులు ప్రజలకు ఇబ్బందులు కల్గించవద్దని కోర్టు సూచించింది. ఐఎఎస్ ల వినతిని మరోసారి పరిశీలించాలని డీఓపీటీని ఆదేశించమంటారా అని హైకోర్టు ప్రశ్నించింది. డీఓపీటీ ఉత్తర్వులపై నవంబర్ 4న విచారణ వాయిదా వేసింది. అప్పటివరకు రిలీవ్ చేయవద్దని ఐఎఎస్ లు కోరారు. రెండు రాష్ట్రాలు కూడా రిలీవ్ చేసేందుకు 2 రాష్ట్రాలుగడువు కోరాయని ఐఎఎస్ ల తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories