HYDRAA: మరో ఆపరేషన్‌కు సిద్ధమైన హైడ్రా

HYDRAA Dismantles Footpath Encroachments to Ease Hyderabad Traffic
x

HYDRAA: మరో ఆపరేషన్‌కు సిద్ధమైన హైడ్రా 

Highlights

HYDRAA: కబ్జాదారుల పాలిట సింహ స్వప్నం… అక్రమ నిర్మాణాల అంతుచూస్తున్న హైడ్రా ఇప్పుడు మరో ఆపరేషన్‌కి రెడీ అయ్యింది.

HYDRAA: కబ్జాదారుల పాలిట సింహ స్వప్నం… అక్రమ నిర్మాణాల అంతుచూస్తున్న హైడ్రా ఇప్పుడు మరో ఆపరేషన్‌కి రెడీ అయ్యింది. హైదరాబాద్ మహానగరం‪లో ట్రాఫిక్ సమస్యలకు చెక్‌ పెట్టేందుకు ట్రాఫిక్ విభాగంతో కలిసి పని చేస్తుంది. విడతల వారీగా తమ బృందలను రంగంలోకి దింపుతుంది. నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ సిటీ గా మార్చడమే హైడ్రా లక్ష్యం అని అధికారులు చెప్తున్నారు. ఫుట్‌పాత్‌ల ఆక్రమణల తొలగింపుతో పాటు డీఆర్ఎఫ్ బృందాలకు ట్రాఫిక్ నియంత్రణపై శిక్షణ ఇప్పించారు.. వర్షం పడినప్పుడు వాట‌ర్‌ లాగింగ్ పాయింట్ల వ‌ద్ద నీరు నిల‌వ‌కుండా చర్యలు తీసుకోవడం వర్షం లేనప్పుడు ట్రాఫిక్ నియంత్రణ చేయడంలో ట్రాఫిక్ విభాగంలో కలిసి పని చేయడంలో హైడ్రా బాధ్యతగా పనిచేయబోతోంది.

నగరంలో ట్రాఫిక్ సమస్య అందరికి తెలిసిందే. గంటల తరబడి ట్రాఫిక్ లో ఎదురుచూడాలి. ట్రాఫిక్ ఫ్రీ సిటీ గా మార్చాలని హైడ్రా ఫుట్‌పాత్ లపైన ఉన్న దుకాణలను ఖాళీ చేయిస్తుంది. అలాగే ఇప్పుడు ట్రాఫిక్ విభాగంతో కలిసి ట్రాఫిక్ నియంత్రణచేస్తుంది. ఫుట్‌పాత్‌ల ఆక్రమణల తొలగింపుతో పాటు డీఆర్ఎఫ్ బృందాలకు ట్రాఫిక్ నియంత్రణపై శిక్షణ ఇప్పించారు..మొదటి విడతలో 50 మందికి గోషామహల్ లో నాలుగు రోజులు ట్రైనింగ్ ఇచ్చారు. వీరంతా మోటార్ సైకిల్‌పై వెళ్తున్న వారిలో హెల్మెట్ పెట్టనివారిని పట్టుకోవడం. ట్రిపుల్ రైడింగ్ చేసేవారిని గుర్తించడం, రోడ్డు మలుపుల్లో ఫ్రీ లెఫ్ట్ చేయిండంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు.

వర్షం పడినప్పుడు వాట‌ర్‌ లాగింగ్ పాయింట్ల వ‌ద్ద నీరు నిల‌వ‌కుండా చర్యలు తీసుకోవడం, వర్షం లేనప్పుడు ట్రాఫిక్ నియంత్రణ చేయడంలో ట్రాఫిక్ విభాగంలో కలిసి పని చేయడం వీరి పని. వర్షం పడినపుడు ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. రోడ్ల పైన నీరు తొలిగించేలా హైపవర్ మోట‌ర్లను వినియోగించాలని నిర్ణయించారు. హైడ్రా, ట్రాఫిక్ విభాగం కలిసి వ‌ర‌ద కాలువ‌లు, పైపుల్లో పేరుకుపోయిన వ్యర్థాల‌ను తొల‌గించ‌డం, కొత్త లైన్లను వేసి వ‌ర‌ద‌కు శాశ్వత ప‌రిష్కారం చూపనున్నారు.ఇలా కూడా ట్రాఫిక్ సమస్య కొంత వరకు తగ్గుతుంది.

అలాగే జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ విభాగాలతో కలిసి న‌గ‌రంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడటమే కాదు.. న‌గ‌ర ప్రజ‌లు సాఫీగా న‌డ‌చుకుని వెళ్లే విధంగా ఫుట్‌పాత్‌ల‌ను రూపొందించాలని నిర్ణయించింది హైడ్రా. అలాగే కూల‌డానికి సిద్ధంగా ఉన్న చెట్లు, కొమ్మల‌ను తొలగించాలని డిసైడైంది. మొత్తంగా.. పలు విభాగాలు, ప్రజ‌ల భాగ‌స్వామ్యంతో భాగ్యనగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది హైడ్రా.


Show Full Article
Print Article
Next Story
More Stories