Hydra: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో హైడ్రా ఆకస్మిక తనిఖీ

HYDRA surprise inspection in Ibrahimpatnam constituency
x

Hydra: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో హైడ్రా ఆకస్మిక తనిఖీ

Highlights

Hydra: ఇబ్రహీంపట్నం పెద్ద చెరువును పరిశీలించిన హైడ్రా బృందం

Hydra: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో హైడ్రా ఆకస్మిక తనిఖీ చేపట్టింది. స్థానిక ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి ఇబ్రహీంపట్నం పెద్ద చెరువును హైడ్రా పరిశీలించింది. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువును ఆనుకుని ఉన్న ఉప్పరిగూడ, పోచారం, చర్ల పటేల్ గూడా గ్రామాల్లోని FTL, బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలను క్షుణ్ణంగా పరిశీలించింది. అక్రమ నిర్మాణాలను తాము కూల్చి వేయకముందే యజమానులే సరైన నిర్ణయం తీసుకోవాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. హైడ్రా బృందంతో పాటు ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories