HYDRA:హైడ్రా మరో సంచలన నిర్ణయం..! అనుమతులిచ్చిన అధికారులపై కేసులు..?

hydra-is-prepared-for-criminal-cases-against-the-officials-who-gave-the-permitions
x

HYDRA :హైడ్రా మరో సంచలన నిర్ణయం..! అనుమతులిచ్చిన అధికారులపై కేసులు..?

Highlights

HYDRA: క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం చేసిన హైడ్రా

HYDRA: అక్రమకట్టడాల కూల్చివేతలతో సంచలనం సృష్టించిన హైడ్రా.. మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో చెరువుల్లో నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చిన ఉన్నతాధికారులపై క్రిమినల్ చర్యలకు హైడ్రా రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే సైబరాబాద్ పరిధిలో మున్సిపల్ శాఖ, HMDA..సర్వే డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన ఐదుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు సైబరాబాద్ కమిషనర్‌కు సిఫార్స్ చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఈ క్రిమినల్ చర్యల లిస్ట్‌లో నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్.. చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్, HMDA ఏపీవో, బాచుపల్లి MRO, మేడ్చల్ జిల్లా సర్వే ఏడీలు ఉన్నట్టు తెలుస్తుంది. వీరిపై చర్యలు తీసుకోవడానికి హైడ్రా రంగం సిద్దం చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories