Musi-HYDRA: మూసీ టెన్షన్ టెన్షన్.. కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన

Musi-HYDRA: మూసీ టెన్షన్ టెన్షన్.. కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన
x
Highlights

Musi-HYDRA:తెలంగాణలో హైడ్రా హాట్ టాపిగ్గా మారింది. హైడ్రా కూల్చివేతలను కొందరు సమర్థిస్తుంటే..మరికొంతమంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరి తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏమన్నారో చూద్దాం.

Musi-HYDRA: తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ విన్నా హైడ్రా గురించే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గురించి పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చెరువుల దగ్గర నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయమని చెబుతూ హైడ్రా కమిషనర్ కు పవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు కూడా సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కూల్చివేతలు వద్దని అక్రమ నిర్మాణాల్లో ఉంటున్న ప్రజలు మొత్తుకుంటున్నారు. ఇలా రెండువైపులా ఆయనపై ఒత్తిడి పెరిగింది.

తాజాగా మూసీ నదీ పరీవాహక ప్రాంతంలో ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ బ్రుందంతో సర్వే నిర్వహించింది. ఈ బ్రుందం 1600 అక్రమ నిర్మాణాలను గుర్తించింది. వీళ్లకు హైడ్రా నుంచి నోటీసులు వెళ్లాయనీ త్వరలోనే ఈ భవనాలను కూల్చివేస్తారన్న ప్రచారం జోరుగా జరుగుతుంది. ఈ అంశంపై హైడ్రా కమిషనర్ కీలక ప్రకటన చేశారు. హైడ్రా గురించి కొందరు వ్యక్తులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారన్నారు కమిషనర్. రాష్ట్రంలో ఎక్కడ ఏ నిర్మాణం కూల్చినా దానికి హైడ్రా కు లింక్ పెడుతున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో శనివారం భారీ కూల్చీవేతలకు హైడ్రా సిద్ధమైనట్లు ప్రచారం చేయడాన్ని ఆయన ఖండించారు. మూసీకి సంబంధించి జరిపిన ఏ సర్వేలో కూడా హైడ్రా భాగం కాలేదన్నారు. అక్కడ ఎవరికీ హైడ్రా నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు.

కూకట్ పల్లిలో బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. కూకట్ పల్లిలోని చెరువుకు దగ్గరలో ఉంటున్న బుచ్చమ్మ, తన కూతుర్లకు కట్నం కింద ఇల్లు ఇవ్వగా..కూల్చివేతల్లో భాగంగా ఆ ఇల్లును కూలుస్తారన్న ప్రచారం జరగడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఆత్మహత్యకు తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

మూసీ పరీవాహక ప్రాంతంలోని నిర్వాసితులకు సంబంధించి మూసీ రివర్ ఫ్రంట్ ఎండీ దానకీశోర్ ఓ కీలక ప్రకటన చేశారు. ఇళ్లకు పట్టాలు ఉన్నా వారు అయితే వెంటనే జిల్లాల కలెక్టర్లను కలవాలన్నారు. తద్వారా ఆ కలెక్టర్లను పట్టాలను పరిశీలించి, పునరావాసం, పరిహారంపై పరిశీలిస్తారని తెలిపారు. పట్టాలు లేని నిరుపేదలైతే..వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామని ప్రభుత్వం తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories