HYDRA Demolitions: మాదాపూర్‌లో 5 అంతస్తుల భవనం కూల్చేస్తోన్న హైడ్రా

HYDRA Demolitions: మాదాపూర్‌లో 5 అంతస్తుల భవనం కూల్చేస్తోన్న హైడ్రా
x
Highlights

HYDRA demolishing 5 floors building at Ayyappa Society in Madhapur: హైడ్రా మరోసారి యాక్టివ్ అయింది. ఇటీవల నానక్ రామ్ గూడలో అక్రమ నిర్మాణాలు కూల్చేసిన...

HYDRA demolishing 5 floors building at Ayyappa Society in Madhapur: హైడ్రా మరోసారి యాక్టివ్ అయింది. ఇటీవల నానక్ రామ్ గూడలో అక్రమ నిర్మాణాలు కూల్చేసిన హైడ్రా తాజాగా హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీకి చేరుకుంది. ఆదివారం ఉదయం నుండే హైడ్రా మరోసారి కూల్చివేతలకు తెరతీసింది.

అయ్యప్ప సొసైటీలో 100 ఫీట్ రోడ్డుకు ఆనుకుని నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం గురించి స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా కమిషనర్... ఆ భవనం అక్రమంగా నిర్మించారని నిర్ధారించుకున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత బుల్‌డోజర్ల సాయంతో ఆ ఐదంతస్తుల భవనాన్ని కూల్చేపని మొదలుపెట్టారు.


అక్రమ నిర్మాణం అని ముందే చెప్పిన కోర్టు

ఇదే భవనం గురించి గతంలోనే జీహెచ్ఎంసీ సిబ్బంది భవన యజమానికి నోటీసులు ఇచ్చారు. ఈ వివాదం హై కోర్టు వరకు వెళ్లగా కోర్టు సైతం ఈ భవనాన్ని అక్రమ నిర్మాణంగానే తేల్చినట్లు సమాచారం. అయినప్పటికీ తాజాగా మరోసారి భవన నిర్మాణం పనులు కొనసాగుతుండటంతో స్థానికులు ఈసారి హైడ్రా దృష్టికి తీసుకొచ్చారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా తాజాగా కూల్చివేతలు చేపట్టింది. భవన యజమాని నుండి ప్రతిఘటనకు తావులేకుండా భారీ సంఖ్యలో పోలీసు బలగాలు మొహరించి ఈ కూల్చివేతను కొనసాగిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories