HYDRA: హోంగార్డు మృతి.. హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదు: రంగనాథ్

Hydra Commissioner AV Ranganath made key comments on Home Guard death Sangareddy
x

HYDRA: హోంగార్డు మృతి.. హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదు: రంగనాథ్

Highlights

HYDRA: సంగారెడ్డి జిల్లాలో అధికారులు కూల్చివేతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అప్పుడు ఓ అపశ్రుతి జరిగింది. ఓ హోంగార్డుకు తీవ్ర గాయాలయ్యాయి. అతను చికిత్స తీసుకుంటూ మరణించారు. ఈ ఘటనపై తాజాగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందిస్తూ..అతన్ని హైడ్రా బలితీసుకుందని అనడం ఏమాత్రం సరికాదన్నారు.

HYDRA: సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ గ్రామంలో పెద్ద చెరువులో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన మూడు అంతస్తుల భవనాన్ని బాంబులతో పేల్చేశారు. అయితే కూల్చివేత సమయంలో శిథిలాలు తగిలి హోం గార్డుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన చికిత్స పొందుతూ మరణించారు. అయితే హోంగార్డును హైడ్రా బలి తీసుకుందని సోషల్ మీడియాలు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు.

కూల్చివేతలన్నీంటికి హైడ్రాకు ముడి పెట్టవదన్నారు. సంగారెడ్డి, మల్కాపూర్ చెరువుతో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. సంగారెడ్డిలో హోం గార్డు గాయపడి మరణిస్తే హైడ్రా బలి తీసుకుందని చెప్పడం సరికాదన్నారు ఏవీ రంగనాథ్.

చంచల్ గూడ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద ఆదివారం రాత్రి సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంచల్ గూడలో కాంగ్రెస్ సర్కార్ మూసీ బాధితులకు డబుల్ బెడ్ రూమ్ లను ఇస్తామంటూ చెప్పింది. దీంతో ముందుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్స్ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారు గొడవకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

హైడ్రాను బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు సపోర్టు చేశారు. చెరువులో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయాల్సిందేనని అని అన్నారు. నాగార్జున అయినా.. రఘునందన్ రావు, ఎన్టీఆర్ అయినా సరే.. చెరువు కబ్జా చేస్తే కూలగొట్టేయాల్సిందేనని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు.

అధికారులకు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వార్నింగ్ కూడా ఇచ్చారు. హైడ్రా పేరుతో సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల్లో అనవసర భయాందోళనలను రేపకూడదన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో కూల్చివేతల పేరిట అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించకూడదని హెచ్చరించారు. హైడ్రా ఔటర్ రింగ్ రోడ్డు లోపలికే పరిమితమని ఏదైనా సమస్యలు ఉంటే తమ ద్రుష్టికి తీసుకురావాలన్నారు. నేను సీఎంతో మాట్లాడుతానని సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు హైడ్రా విషయంల ఎలాంటి భయం అక్కర్లేదన్నారు. నేను మీతోనే ఉంటానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories