YS Sharmila: వైఎస్‌ షర్మిలకు కాంగ్రెస్ ఆఫర్లు.. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పదవితో పాటు..

Hyderabad Ysrtp Merging Into Congress Ys Sharmila Delhi Tour Confirmed
x

YS Sharmila: వైఎస్‌ షర్మిలకు కాంగ్రెస్ ఆఫర్లు.. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పదవితో పాటు

Highlights

YS Sharmila: కాంగ్రెస్ ఆఫర్ల మీద షర్మిల నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి

YS Sharmila: YSRTP అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం ఆఫర్లు ప్రకటించింది. ఖమ్మం లోక్‌సభ స్థానంలో షర్మిలకు టికెట్ ఇస్తామని కాంగ్రెస్ నుంచి షర్మిలకు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పాటు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పదవిని కూడా ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ విషయంపై చర్చించేందుకు ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీకి షర్మిల వెళ్లనున్నట్లు సమాచారం.

YSRTP స్థాపించిన నాటి నుంచి షర్మిల పాలేరు అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగుతానని చెబుతూ వస్తున్నారు. పలు వేదికలపై ఇదే ప్రకటన చేశారు. అయితే కాంగ్రెస్‌లో చేరికపై ఆఫర్ వచ్చాక.. తాను అనుకున్నట్లు పాలేరు నుంచే దిగుతానని.. తన అనుచరులకు కూడా టికెట్లు డిమాండ్లు చేశారు షర్మిల. అయితే ఇప్పటికే ఖమ్మం నుంచి కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరడంతో షర్మిలకు అసెంబ్లీ స్థానం కేటాయించే పరిస్థితి లేనట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఖమ్మం లోక్ సభ నుంచి పోటీ చేయించాలనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. మరి కాంగ్రెస్ ప్రకటించిన ఆఫర్ల మీద షర్మిల స్పందన ఎలా ఉంటుంది..? ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి నెలకొంది.

కాంగ్రెస్‌లో YSRTP విలీనంపై షర్మిల ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇటీవల సెప్టెంబర్‌ 30 లోపు విలీనంపై నిర్ణయం తీసుకుంటానని.. విలీనం లేకపోతే YSRTP రాష్ట్రంలోని 119 స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి టికెట్లు, పార్టీలో దక్కే ప్రాధాన్యతపై స్పష్టత రాకపోవడంతో షర్మిల తన నిర్ణయాన్ని హోల్డ్‌లోనే పెట్టారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఆపర్ రావడంతో షర్మిల ఓకే అంటారా..? సొంత పార్టీతోనే బరిలోకి దిగుతారా..? అనే ఉత్కంఠ నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories