అమెరికా నుంచి పాతబస్తీ మహిళకు ట్రిపుల్ తలాక్

అమెరికా నుంచి పాతబస్తీ మహిళకు ట్రిపుల్ తలాక్
x
Highlights

హైదరాబాద్ పాతబస్తీలో మరో ట్రిపుల్ తలాక్ కేసు చోటు చేసుకొంది. తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరుతుంది. అమెరికాలో ఉంటున్న బాధితురాలి భర్త అది వలీ...

హైదరాబాద్ పాతబస్తీలో మరో ట్రిపుల్ తలాక్ కేసు చోటు చేసుకొంది. తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరుతుంది. అమెరికాలో ఉంటున్న బాధితురాలి భర్త అది వలీ ఫోన్లో ఆమెకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు. నగరంలోని పాతబస్తీకి చెందిన 24 ఏళ్ల ఫాతిమా అనే మహిళకు ఆమె భర్త అదివలీ ఫోన్ లో తలాక్ ఇచ్చాడు. సోమాలియాలో జన్మించి అమెరికాలో ఉంటున్న అదివలీ పాతబస్తీకి చెందిన సబా ఫాతిమాను పెళ్లి చేసుకొన్నాడు. హైద్రాబాద్ చాంద్రాయణగుట్టకు చెందిన ఫాతిమాను 2015 జనవరిలో పెళ్లి చేసుకొన్నాడు. ఆ సమయంలో అతను హైద్రాబాద్ లో ఉన్నాడు.

ముస్లిం సంప్రదాయాల ప్రకారంగా పెళ్లి చేసుకొన్నట్టుగా బాధితురాలు చెప్పారు. పెళ్లి తర్వాత మలక్‌పేట, టోలిచౌకిలలో అద్దె ఇంట్లో నివాసం ఉన్నారు. తన భర్త దేశాన్ని వదిలి వెళ్లినట్టుగా ఆమె చెప్పుకొచ్చారు. ప్రతి ఆరు మాసాలకు ఓసారి ఆయన హైద్రాబాద్ కు వస్తున్నట్టుగా ఆమె చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో హైద్రాబాద్ కు వచ్చినట్టుగా తెలిపారు. అప్పటి నుండి ఆయన హైద్రాబాద్ కు రాలేదని అమెరికాలోని బోస్టన్ లో ఉంటున్నాడని బాధితురాలు తెలిపింది. తనకు న్యాయం చేయాలని ఆమె కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖను కోరింది.

Show Full Article
Print Article
Next Story
More Stories